Monday, July 22, 2013

Welcome back


టైం ఎంత తొందరగా గడిచిపోతుందో!3 సంవత్సరాలు అయింది నేను బ్లాగ్ చూసి, అసలు ఇది ఒకటి ఉందనే విషయమే మర్చిపోయా ఇన్ని రోజులు.
అప్పట్లో బ్లాగ్స్ నాకు పరిచయం అయిన కొత్తలో ఇంట్లో ఖాళీగా ఉండి కొన్ని రోజులు అదే పనిగా అన్ని బ్లాగ్స్ చదివి నేను కూడా ఏదో రాసేద్దాం అని మొదలు పెట్టా కాని చాలామంది new year resolution లాగే 3,4 పోస్ట్ లు రాయగానే ఆపేసా. తర్వాత కొత్త ప్లేస్ కి మారిపొవడం వల్ల, కాస్త బిజీ అయిపోవడం వల్ల అసలు దీని గురించే మర్చిపోయా.ఇంకో కారణం ఎవరైనా నమ్ముతారో లేదో కాని నా కజిన్స్, ఫ్రెండ్స్ (స్కూల్, కాలేజ్ ఇప్పుడు కొలీగ్స్) వీరిలో ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగులో ఏది చదవరు. మొదట్లో ఒక పోస్ట్ చదివి నాకు చాలా నచ్చి ఎవరితోనైనా షేర్ చేసుకుందామని నా ఫ్రెండ్స్ ముగ్గురికి పంపాను చాలా ఫన్నీ గా ఉంది చదవండి అని.
ఒక్కరు కూడా చదవలేదు, చదవక పోయినా ఫీల్ కాకపోయేదాన్ని పైగా "ఏదో 1,2 లైన్స్ అంటే చదివేవాళ్ళం ఇంత పెద్ద పోస్ట్ చదవడం మా వల్ల కాదు" అన్నారు.సరే నేను చదివింది వాళ్ళతో  చెప్పుదామని నాకు గుర్తున్నది అంతా జోక్ లాగా చెప్పా. చెప్తుంటే నాకే అది జోక్ లాగా అనిపించలేదు వాళ్ళకేం నవ్వు తెప్పిస్తుంది  ఇంకా. అప్పుడు అర్థం అయింది ఇద్దరు చదివితేనే దేని గురించైనా మంచిగా మాట్లాడుకోగలరని, నేనొక్కదాన్నే చదివి ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే బావుండదని.
ఇంకా ఆ పరిస్థితుల్లో నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారు, సో అలా ఇది మరుగున పడిపొయింది.
ఇన్ని రోజులకి మళ్ళీ టైం కుదిరింది, దీన్ని బూజు దులిపి బయటికి తీయడానికి .
 So I am saying Welcome to myself .

3 comments:

  1. బ్లాగుకు స్వాగతం, సుస్వాగతం, మీదే ఆలస్యం :)

    ReplyDelete
  2. స్వాగతం అనామిక గారూ . పంచుకోవడానికి బ్లాగు మిత్రులం ఉన్నాం కదండీ !బ్లాగును బూజు పట్టనీయకుండా టపటపా టపాలు వేసేయండిక ఆలస్యమెందుకు ?

    ReplyDelete
  3. kastephale గారు, Nagarani గారు థ్యాంక్సండి మీ కామెంట్ కి. ఈ సారి ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తానో చూడాలి.

    ReplyDelete