Friday, July 19, 2013

రెండు నిర్ణయాలు

అందరికి నమస్కారం.. :)
రోజు నేను రెండు నిర్ణయాలు తీసుకున్నాను.(ఈరోజు నుండి చేద్దామని నిన్న అనుకున్నాను)
ఒకటి బ్లాగు మొదలు పెడదామని, రెండు అన్ని నిజాలే చెపుదామని, అంటే ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పాను అని కాదు కొన్ని ఐన చెప్పి ఉంటాను కదా అవి కూడా చెప్పకూడదు అని.
ఇంకా మొదటి పని విజయవంతంగా మొదలు పెట్టాను, ఇక రెండో విషయానికి వస్తే...
ఈరోజు నా దినచర్య ఇలా మొదలైంది
ఉదయం 9
ఫోన్ మోగుతుంది...అబ్బ మరీ ఇంత ప్రొద్దునే ఎవరు చేస్తున్నారు అనుకోని లేహ్కా అప్పటికి కట్ ఐంది..మా అక్క.తనకి ఒక పని చెయ్యాలి నేను నినన్నే చెప్పింది. ఇంకా పడుకున్నాను అంటే అయిపోతాను ఇంకా అసలే నిజాలు చెప్పాలి అనుకున్నాను కదా, మళ్లీ ఫోన్
"హలో అక్క"
.......
" ..ఎప్పుడో లేచాను (5 నిమిషాలు ఐంది కదా), ఇంకాసేపట్లో వెళ్తాను(కాసేపు అంటే సరైన నిర్వచనం లేదు కాబట్టి ఇది కూడా నిజమే )"
.....
"మర్చి పోను ..బై"
అలా బయటికి వెళ్లి పని పూర్తిచేసుకుని నాకిష్టమైన పానిపూరితిని భోజనం సమయానికి ఇంటికి వచ్హాను
అమ్మ, "అన్నం తినవే"
"లేదమ్మా ఆకలిగా లేదు"
"బయట ఏదో చెత్త తిని వచ్చి ఉంటావ్"
"లేదమ్మా చెత్త ఏం తినలేదు
(పానిపూరి నా దృష్టిలో చెత్త కాదు కావున ఇది కూడా నిజమే అని నా మనవి )
తర్వాత తినకుండా ఎలా తప్పించుకోవడానికి ఇలాంటి నిజాలు చాలానే చెప్పాల్సి వచ్చింది
సాయంకాలం
నాన్న " ఎంతసేపు టీవీ చూడకపోతే కాసేపు చదువుకోవచ్చు కదా "
"ఇప్పటివరకు చదువుకున్నాను నాన్న"(నేను చదివింది న్యూస్ పేపర్ అన్న విషయం నాకు ఒక్కదానికే తెలుసు )
రాత్రి నా గదికి వచ్చి పడుకున్నాను అసలే అమ్మకి త్వరగా పడుకుంటాను అని మాట ఇచ్చాను
ఎలాగబ్బ
రమ్య కి ఫోన్ చేశా తను ఏదో పని చేస్తుందట పడుకోవడానికి ఇంకో గంటలు అంటే మనం 2 గంటల్లో బ్లాగు రాసేస్తే త్వరగా పడుకున్నట్టే కదా (కండిషన్స్ అప్లై రమ్య కన్నా త్వరగా అన్నమాట )
విధంగా విజయవంతంగా అన్ని నిజాలతో ఒక రోజు గడిచింది. అందరు నిజాలు చెప్పడం కష్టం అంటారు. ఇంత ఈజీ అని తెలియదు రేపో మాపో పేరు కూడా మార్మోగిపోతుందేమో ఆడ హరిశ్చంద్రురాలు అని....


3 comments:

  1. నా మాట కోసం వెతుకుతుంటే మీ మాట కనిపించింది.. పనిలో పనిగ మీ మాట (అదేలేండి నా మాట) చూశాను.. మీ రెండు నిర్ణయాలు బాగున్నాయి..రెండో నిర్ణయం అన్ని నిజాలే చెపుదామని ఒకింత కష్టమేనండి,.. ఐనా ఆ సాహసాన్ని అంత సులువుగా చేపట్టి విజయం సాదించారు.. ప్రతీ వాక్యం చివరన మీ కామెంట్స్ చాలా బాగున్నాయి.. మీలొ హాస్యం, వ్యంగం, వెటకారం పాళ్ళు కాస్త ఎక్కువని అర్దమవుతోంది... నాకు నఛ్చినది కూడా అదే... హాస్యంలో వ్యంగం, మాటకు మాట కౌంటర్ బాగుంటాయి మరి..
    వీలైతే నా మాట కూడా వీక్షించండి..
    http://naaamaata.blogspot.com

    ReplyDelete