Monday, September 30, 2013

ఆంధ్ర-తెలంగాణ భాష

ఇప్పుడంతా ఆంధ్ర-తెలంగాణానే హాట్ టాపిక్ కదా. కాని నేనేం తెలంగాణానో, సమైక్యాంధ్ర ఉద్యమం గురించో చెప్పట్లేదులెండి.
ఆంధ్ర-తెలంగాణ వాళ్ళు వాడే భాష వల్ల జరిగిన కొన్ని చిన్న విషయాలు.
మనం ఎవరన్నా వేరే భాష వాళ్ళతో, కొత్త భాషలో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అర్థం కాకపోతే ఆ భాష మనకి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి అడిగి confirm చేసుకుంటాం. కాని తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే మాట్లాడుకుంటే ఎలాగూ మనకి తెల్సిన భాషే అని, మనకు వచ్చినట్టూ అర్థం చేసుకుంటామేమో.
ఇదంతా ఇప్పుడెందుకంటే,
మా ఫ్రెండ్స్ ఇద్దరి వల్ల ఒకసారి జరిగిన కామెడి గుర్తొచ్చింది. మా ఫ్రెండ్స్ లో ఒకతను ఏదో పని చేసుకుంటూ ఇది కాస్త చిల్లు పెట్టరా అని చేతిలో ఉన్న కొత్త ointment పక్కనున్నతనికి ఇచ్చాడట.
ఎంతసేపటికి తిరిగి తెచ్చివ్వకపోతే, చిల్లు పెట్టడానికి ఇంతసేపేంటా అని, అతన్ని పిలిచి ఏదిరా ointment అంటే, fridgeలో ఉంది అన్నాడు. అదేంటి ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టావంటే, నువ్వే కదా chill పెట్టమన్నావ్, అందుకే తీసుకెల్లి fridgeలో పెట్టా అన్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే అతనికి చిల్లు అంటే hole చెయ్యాలని తెలియదు. అసలు అలా ఎలా అనుకున్నావ్ చిల్లు అంటే తెలియకపోయినా fridgeలో పెట్టాలన్నఆలోచన ఎలా వచ్చింది అంటే, దాని మీద keep in cool place అని రాసి ఉంది అందుకే chill గా పెట్టమన్నావేమో అనుకున్నా అన్నాడు :).


ఇలాంటిదే ఇంకోటి, నేను ఇంటర్ కి హాస్టల్‌లో చేరాను. ఒకరోజు ప్రొద్దున్నే లేచి రెడీ అయ్యిstudy hours కి వెళ్తున్నాము. త్వరత్వరగా బుక్స్ తీస్కొని పరిగెడుతున్నా.  లాస్ట్‌లో నేనే ఉన్నాను. ఇంతలోకి మా వార్డెన్ నా ముందు నుండి కోపంగా అరుస్తుంది. "ట్యాప్ కట్టేసి రా" అని. నకు అర్థం కాలేదు, ఎవర్నో ఏదో కట్టెసి రమ్మంటుంది, నాకెందుకు అని నేను అలానే ముందుకి వెల్తున్నా. మళ్ళీ నన్నే పిలుస్తూ అమ్మాయ్, ఆ ట్యాప్ కట్టెసి రా అంది.
అసలు ఏం కట్టెయ్యాలి, ఎక్కడ కట్టెయ్యాలి, అక్కడ వెనక చూస్తే తాడు లాంటిది ఏమి కనిపించట్లేదు నాకు. ఎవరైనా ఏదన్నా కట్టు విప్పేసారా తెలీకుండా, నన్ను అంటుంది వార్డెన్ అనుకుంటూ అయోమయంగా చుస్తూ నిల్చున్నా. ఈలొపు తనే వచ్చి, ట్యాప్ ఆపేసి, ఏమ్మా వాటర్ పోతున్నాయ్ ట్యాప్ లోంచి ఆపెయ్యమంటే వినపదట్లేదా అని వెళ్ళిపోయింది. అప్పుడర్థం అయ్యింది కట్టెయ్యమంటే అర్థం ఆపెయ్యడం అని.
ఇప్పుడు తెల్సిన/వాడుతున్న చాలా తెలుగు పదాలు స్కూలింగ్ తర్వాత నేర్చుకున్నవే. అప్పుడు చాలా పదాలకి అర్థమే తెలియకపోయేది.

14 comments:

  1. :)

    --
    అనామకుడు

    ReplyDelete
    Replies
    1. thanks for the comment and identifying with ur name. :)

      Delete
    2. నాకో డౌట్ పేరులేని అమ్మాయి గారు (అనామికా గారు)
      వేరే ఎవరైనా నా పేరు పెట్టి కామెంట్ రాస్తే నన్ను ఎలా గుర్తు పడతారు????

      -అనామకుడు-

      Delete
    3. ఎలా గుర్తుపట్టలేను. మీరనుకొనే రిప్లయ్ ఇస్తాను.

      Delete
  2. ఇలానే ఓసారి, నేను హైదరాబాద్ శివార్ల కి వెళ్లాను అక్కడ మా బంధువులు ఉంటె .. చాలా సంవత్సరాల నుండి ఉండటం వల్ల , వాళ్ల భాష కొంచెం మారిపోయింది , ఒరేయ్ ఆ నల్లా కట్టేయరా అని చెప్తే, నేను అటు ఇటు చూసి నల్లానా వాళ్ళెవరు ? అని అడిగాను .

    ReplyDelete
    Replies
    1. హహ బాగా గుర్తుచేసారు. నేను పోస్ట్ రాసే అప్పుడు ట్యాప్ అని రాస్తున్నా.. కాని అది కరెక్ట్ వర్డ్ అనిపించలేదు. పంపు అని కూడా అనము మేము. ఏంటబ్బా ఆ పదం అనుకున్నాను కాని ఎక్కువ ఆలోచించలేదు. మేం కూడా నల్ల అనే అనేవాళ్లం. స్కూల్ లో ఉన్నప్పుడు రోజు ప్రొద్దున్నే నల్లొస్తుంది నల్లొస్తుంది లే నీళ్లు పట్టాలి..ఇలానే పిల్చి లేపేది ఇంట్లో

      Delete
  3. chillu peetu= pokka poduvu

    maa friend annamu aakali vesthundhi antaadu.. naakua rthamu kaadhu.. annamu aakali, pizza aakali ani veru veru untaayaa...

    kotthalu levu raa, dhudlu levu.. == paisa lu levu raaa

    chokka vesuko=== angi thodukko..

    niccker== laagu

    kulayi katteyi= nalla banjeyi.



    ReplyDelete
  4. ధర్మమేవ జయతే!
    జై తెలంగాణ!

    ReplyDelete
  5. భాష ప్రాంతాలను బట్టి పలికే విధానం కొద్దిగా మారుతుంది.
    తొందరగా రా = బేగి రా
    కూర వెయ్యి = కూర తీస్కో
    ఎక్కడికి = యాడికి
    కొంచెం సరదాగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. అవునం బాల గారు... కొన్ని పదాలు అలవాటైన వాళ్లకి ఏమి అనిపించదు కాని, కొత్తవాళ్ళకి funny గా అనిపిస్తాయి.

      Delete
  6. ఏంటి బిజీ ఐపొయారా?
    పేరులేని మేడం రాయటం మానేశారు:)
    (అనామకుడు)

    ReplyDelete
    Replies
    1. అవునండి. రాద్దాం అనుకుంటున్నా కాని కుదరట్లేదు..:(
      పేరులేని మేడం అనక్కర్లేదు.. అనామిక అనే పిలవొచ్చు..

      Delete