Tuesday, August 27, 2013

కొన్ని నమ్మకాలు

మనలో చాలామందికి రకరకాల నమ్మకాలుంటాయి. ఏదైనా పని మొదలుపెట్టే అప్పుడు తుమ్మితే ఆ పని కాసేపు ఆపాలని,ఇంట్లోంచి బయటికి వెళ్ళే అప్పుడు పిల్లి ఎదురైతే మంచి జరగదని అనుకోవడం,   ప్రొద్దున్నే లేచి ఇష్టమైన వాళ్ళ మొహం చూడాలనుకోవడం ఇల్లంటివి చాలా ఉన్నయి.
కొందరు కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు.
ఆ నమ్మకం ఎదుటివాళ్ళకి ఇబ్బంది కలిగించనంతవరకూ నష్టం లేదు.ఇవన్ని మన దేశంలోనే ఎక్కువ అనుకునేదాన్ని. కాని ఇక్కడికొచ్చాక అర్థమైంది అమెరికా వాళ్ళకి కూడా నమ్మకాలెక్కువ, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చాలా విషయాల్లో మన నమ్మకాలతో కలుస్తాయి. నల్ల పిల్లి విషయం, పగిలిన అద్దం లో  చూసుకోకూడదు ఇలంటివి కొన్ని.
ఇంక చెప్పాలంటే అమెరికా వాళ్ళకి ఎంత భయమో చూడండి.

ఇది మా బిల్డింగ్‌లో లిఫ్ట్ లో తీసిన ఫోటో.చూసారా అందులో 13 నంబర్ లేదు. 13 అంటే దురదృష్టమైన సంఖ్య అని నమ్ముతారని తెలుసు కాని ఇలా ఒక బిల్డింగ్‌లో 13వ ఫ్లోర్ లేకుండా 12 తర్వాత 14 వ ఫ్లోర్ నంబర్ వేసారు.

ఈ సీరియస్ నమ్మకాలని వదిలేస్తే చిన్నతనంలో అమాయకంగా అనుకున్న కొన్ని విషయాలు ఎంత బావుంటాయో..
కాకి అరిస్తే కాని, చేతిలోంచి ఎదైనా జారిపోతే కాని, ఇద్దరు ఒకేసారి ఒకే మాట అంటే కాని ఇంటికి చుట్టాలొస్తారనీ..
వర్షం పడ్డప్పుడు రెయిన్‌బో వస్తే సీతమ్మ చీర ఆరేసుకుందనీ..
పిడుగు పడిటం అంటే అర్జునుడి రథం లోంచి ఒక ముక్క విరిగిపడటం అనీ..
కాళ్ళు చాపుకున్నప్పుడు దాటితే పుండు పడుతుందనీ..
బుక్‌లో నెమలీక దాచిపెట్టుకుంటే అది పిల్లలు పెడుతుందనీ..(అంటే ఒకటి పెడితే అది పిల్లలు పెట్టి 2 అవుతాయంట)
జడ వేసుకోకుందా జుట్టు వదిలెస్తే దయ్యం పడుతుందనీ(అలా అయితే ఇప్పుడు ప్రతీ అమ్మాయికి ఒక దయ్యం అవసరం పడేది :))
మాడిపోయిన అన్నం తింటే జుట్టు బాగా పెరుగుతుందనీ..(ఇదైతే మాడిన అన్నం అవగొట్టడానికి అమ్మ వాళ్ళు చేసిన కుట్ర  అని నా అభిప్ర్రాయం, అందులోను ఆడపిల్లలకి ఎక్కువ అన్యాయం జరిగేది దీని వలన, మరి వాళ్ళే కదా జుట్టు కోసం ఆరాట పడేది)
అన్నం చాలా సేపు తింటే పెళ్ళి ఆలస్యంగా అవుతుందనీ...
ఇంకా అందరం ఒక్కసారన్నా అనుకొని ఉంటాం తలలు గుద్దుకుంటే కొమ్ములొస్తాయని...
ఇంకా..
హా..హాచ్చ్...అబ్బ ఇప్పుడే పోస్ట్ పబ్లిష్ చేద్దామనుకుంటే తుమ్మొచ్చింది కాసేపాగి చేస్తానేం..

15 comments:

  1. >>>జడ వేసుకోకుందా జుట్టు వదిలెస్తే దయ్యం పడుతుందనీ(అలా అయితే ఇప్పుడు ప్రతీ అమ్మాయికి ఒక దయ్యం అవసరం పడేది :))>>>>

    అందుకే దయ్యాలు వెంటపడుతున్నాయి కదా :) ఎదుటివారు ఆచరిస్తే మూఢనమ్మకం మనం ఆచరిస్తే అలవాటు. ఇదీ పెద్దన్నయ్య గారి డేశపు తీరు

    ReplyDelete
    Replies
    1. Kastephale gaaru: నిజమే.. ఎదుటివారు ఆచరిస్తే మూఢనమ్మకం మనం ఆచరిస్తే అలవాటు అనుకుంటారు

      Delete
  2. హ హ హ .. బాగున్నాయి కదా.
    వర్షం పడ్డప్పుడు రెయిన్‌బో వస్తే సీతమ్మ చీర ఆరేసుకుందనీ..
    కాళ్ళు చాపుకున్నప్పుడు దాటితే పుండు పడుతుందనీ..
    ఈ రెండూ తెలియదు నాకు.

    ReplyDelete
    Replies
    1. Uma gaaru: ఇంకా చాల ఉండి ఉంటాయ్, మన కన్నా పిల్లలకే ఇలాంటివి ఎక్కువ తెలుస్తాయనుకుంటా.

      Delete
  3. ఇంట్రెస్టింగ్ ఇందులో కొన్ని నాకు తెలియవండోయ్ :)

    ReplyDelete
    Replies
    1. వేణూశ్రీకాంత్ గారు: ఇక్కడ నాకు గుర్తున్నవి రాసాను. చిన్నప్పుడు ఇంకా చాలా ఉండేవనుకుంటా

      Delete
  4. 13 నెంబర్ నమ్మకం గురించి మొదటి సారి వింటూ చూస్తున్నా, ఇంటరెస్టింగ్.
    ఇక మీరు రాసిన నమ్మకాలన్నీ తెలుసు :)

    ReplyDelete
  5. ఫోటాన్ గారు: 13 అంటే చెడు అంకెగా భావిస్తారని నాకు ఇంతకుముందే తెలుసు కాని, మరీ ఇంతగా అని తెలీదు.
    అవునా మీకవన్నీ తెల్సా.. :)

    ReplyDelete
    Replies
    1. ఎస్, తెలుసండీ.. ఇవి కుడా కొన్ని ఆడ్ చేసుకోండి :))

      ఇంకా బయలుదేరినపుడు, ఎవరైనా ఎక్కడ పోతున్నావ్ అని అడిగితే కాసేపు కూర్చొని పోవాలి, లేదంటే పోతున్న పని జరుగదు.

      ప్రొద్దున్నే ఎడమ పక్కనుంచి లేవకూడదు, అలా లేచినచో ఆరోజు బళ్ళో దెబ్బలు తినాల్సి వుంటుంది

      బళ్ళో దెబ్బలు పడకుండా వుండేకి ఎనిమిది చిన్న రాళ్ళు జోబులో వేసుకోవాలి.

      బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి

      etc etc etc....... :))




      Delete
  6. రుబ్బురోలు మీద కూర్చుంటే పెళ్లి ఆలస్యం అని
    తడి బియ్యం తింటే పెళ్లి నాడు వాన వస్తుందని .
    బెండకాయలు తింటే తెలివి తేటలు పెరుగుతాయన్న నమ్మకం ఇప్పటకి పోలేదు , అదెప్పుడు పోతుందో ...

    ReplyDelete
    Replies
    1. బెండకాయ విషయంలో ఏదైనా సైంటిఫిక్ కారణం ఉంటుందంటరా??చాలామంది పెద్దవాళ్ళు కూడా నమ్ముతారు ఇది.
      రుబ్బురోలు,తడి బియ్యం ఇవి తెలీదు నాకు..

      Delete
  7. ఫోటాన్ గారు: >>"బళ్ళో దెబ్బలు పడకుండా వుండేకి ఎనిమిది చిన్న రాళ్ళు జోబులో వేసుకోవాలి"<< ha haa ha
    నిజ్జంగా ఇలా అనుకునేవాళ్ళా చిన్నప్పుడు..this is very funny... :):)
    ఛ ఈ విషయం తెలీక అనవసరంగా దెబ్బలు పడ్డా స్కూళ్ళో..

    ReplyDelete
  8. గడప మీద కూచుని తుమ్మకూడదు, ఒకవేళ తుమ్మితే లేవకుండా తలమీద నీళ్ళు చల్లాలి.

    సందేళ గడప మీద కూచోకూడదు.

    మగాడు కాళ్ళ తడి ఆరేలోగా అన్నం తినెయ్యాలి.

    బాసింపట్ట వేసుక్కూచుని అన్నం తినాలి (డైనింగు టేబుళ్ళూ అవీ ఉండేవి కాదులెండి). ఒక కాలు అడ్డంగాను, ఒక కాలు నిలువుగానూ మడిచి కూచుండే పనైతే, ఎడంకాలు మాత్రమే నిలువుగా ఉండాలి.

    ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు - అటేపు హిమాలయా లుంటాయి, హిమాలయాల్లో ఆంజనేయస్వామి ఉంటాడు, అందుకని. :)

    దూలం కింద పడుకోకూడదు.

    ReplyDelete
  9. ఊరికి బయల్దేరేటపుడు సిద్ధం చేసుకున్న పెట్టెల మీద కూర్చుంటే ప్రయాణంలో ఆటంకాలు వస్తాయని,
    పరీక్ష రోజు తలకు పోసుకుంటే మెదడు కడిగేసినట్టు అన్నీ మరిచిపోతామని,
    చెప్పుకునేవాళ్ళం కదూ.
    అయినా మన దేశంలోనే అని అనుకోవడం మూర్ఖత్వమండీ. మనుషులున్న చోటల్లా ఇవి ఉంటాయి. అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. వాటి గురించి చదివినాము.

    ReplyDelete
  10. చదువరి గారు: నాకు తెలియని కొత్త నమ్మకాలు చెప్పారు :)
    లక్ష్మీదేవి గారు: అవునండి, మనుషులున్న చోటల్లా ఇవి ఉంటాయి.

    ReplyDelete