Thursday, August 29, 2013

నీ జ్ఞాపకాలు

సంతోషానికి సంకెళ్ళు పడ్డాయి
మనసు గోడల్ని దాటి రానంటోంది
ఆనందం ఆనవాలు కోల్పోయింది
నీ జ్ఞాపకాల వలలో చిక్కుకొని...

దు:ఖం కొత్త చుట్టమయ్యింది
నీ తలపుల తలుపులు తెరుచుకొని
విషాదమే ఆకాశమై  ఆదుకొంది 
నువ్వు వదిలేసిన ఈ ప్రపంచాన్ని...

5 comments:

  1. జ్ఞాపకాల వల లో నలిగినా,
    మధుర స్మృతుల అలలే తగలాలి !
    తిరిగి ఆనందపు ఓనమాలు వల్లె వేసుకోవాలి !
    వ్యధలు బంధువులవుతే అవి ,
    నీలోని సుధా సింధువు లో బిందువులవాలి !
    తలపు తలుపులలోంచి తళుకు మనే
    వెలుగు కిరణాలను వెతుకు !
    అమూల్యం, ఈ జగతి లో నీ బ్రతుకు !

    ReplyDelete
    Replies
    1. Sudhakar గారు: చాలా బావుందండి.పోస్ట్ కన్నా కామెంటే బావుంది..

      Delete
    2. జ్ఞాపకాలు,
      గుండె లోతుల్లో గుచ్చుకునే గులాబి ముళ్ళు!
      మనసంతా పరిమళించే మొగలి మొదళ్ళు!
      సొగసంతా కనిపించే నెమలి పింఛాలు!
      రాస్తూ ఉండండి, మీ చక్కని టపాలు!

      Delete
  2. సంకెళ్ళు తెంపెయ్యండి, అడ్డుగోడలు బద్దలు కొట్టండి, ఆనందానికి స్వతంత్రమియ్యండి.

    ReplyDelete