Friday, May 30, 2014

దుబాయ్ ట్రిప్ - Day 4

ఈరోజు ట్రిప్‌లో చివరి రోజు. ఏమి ప్లాన్స్ పెట్టుకోలేదు, ఇంకా చూడ్డానికి ఇంట్రెస్టింగ్ ఫ్లేసెస్ కూడా ఏమి అనిపించలేదు. అందుకని ఊరికే సిటీలో తిరిగేసి, వచ్చి కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ 14 గంటలు ఫ్లైట్‌లో ప్రయాణం చెయ్యాలి కదా.
కిందికి వెళ్లి దుబాయ్ మాల్ లాంటి పెద్ద మాల్ కాకుండా మామూలు షాప్స్ ఎక్కడుంటాయో కనుక్కుని బయల్దేరాం. ఎలాగూ టైంపాస్ కే కదా తిరిగేది అని మెట్రోలోనే వెళ్లాం. అక్కడ కొన్ని souvenirs, చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకున్నాం.నిన్న మాతో పాటు desert safariకి వచ్చిన ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడెక్కడికివ్ వెళ్లారో చెప్తూ Dubai creekకి వెళ్లాము, చాలా బావుంది visit చెయ్యాల్సిన ప్లేస్, మీకు టైం ఉంటే వెళ్లండి అని చెప్పారు. బయల్దేరేముందు కనుక్కుంటే ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ కి దగ్గర్లొనే ఉంది.  టైం ఉంది కదా అక్కడికి వెల్దాం అనుకున్నాం. అక్కడి నుండి ఒక ట్రైన్లో వెళ్లి , ఇంకో బస్ తీసుకుంటే చేరుకోవచ్చు. ట్రైన్ దిగి బస్ ఎక్కడ    ఆగుతుందో కనుక్కొని బస్టాప్ కి వెళ్లాం. ఒక 10 నిమిషాల తర్వాత  బస్ వచ్చింది, తీరా ఎక్కిన తర్వాత బస్ లో మెట్రో కార్డ్ స్వైపింగ్ మిషన్ మాత్రమే ఉంది. అది కూడా మా దగ్గర ఉన్న ట్రైన్ కార్డ్ పని చెయ్యదంట. బస్‌లో ఎక్కాలంటే వేరేది తీసుకోవాలి, క్యాష్ కూడా తీసుకోరు.
ఇంక బస్ దిగేసి మళ్ళీ స్టేషన్ లోపలికి అంత దూరం  aఏం వెళ్తాం లే అని టాక్సి ఆపేసి ఎక్కాం.ఎక్కడికెళ్లాలో చెప్తే  ఆ డ్రైవర్ అది పక్కనే నడుస్తూ వెళ్ళొచ్చు అని చెప్పి, ఇలా ముందుకు తీస్కెళ్ళి 2 నిమిషాల్లో ఆపేసాడు. అసలు ఆ ప్లేస్ ఏంటో కూడా తెలియదు(బ్రౌజ్ చెయ్యడానికి నెట్ కూడా లేదు కదా!) బయట చూస్తే చాలా మంది ఉన్నారు.  టికెట్ తీసుకొని లోపలికెళ్లాం. తీరా చూస్తే అదేంటో కాదు.. చిల్డ్రన్స్ పార్క్!!అన్ని చిన్న పిల్లల activities ఉన్నాయి. ఎలాగూ వచ్చేసాం  కదా అని అటు ఇటూ తిరిగి కాసేపు కూర్చుని బయటికొచ్చేసాం. రూం కొచ్చేసి నిన్న, మొన్న బయటికి లాగి పడేసిన లగ్గేజ్  అంతా సర్దుకొని, చెక్ అవుట్ చేసి బయటపడ్డాం.
వచ్చిన రోజు మా మామయ్య వాళ్లకి, తర్వాత డ్రైవర్‌కి ఒక 2,3 సార్లు కాల్ చేసాం కదా, దానికి 120 dirhams చార్జ్ చేసారు. మా దగ్గర unlocked ఫోన్ లేదు, ఫోన్ ఉంటే అక్కడి sim card కొనుక్కొని వేసుకోవచ్చు. మనల్ని ఎవరైనా కాంటాక్ట్ చెయ్యడానికి ఉంటుంది. పెద్ద ఖర్చేం కాదు, హొటల్ నుండి చేసుకున్న దాని కన్నా చాల తక్కువ.  
అలాగే మా దగ్గర అక్కడి స్విచ్ బోర్డ్‌లో సరిపొయే ప్లగ్ లేదు,ఇండియాది కాని, US ది కాని సరిపోదు అక్కడ. ఫస్ట్ డే కెమెరాలో mamory card ఫుల్ అయిపోతే laptopలో కాపీ చెయ్యడానికి laptop చార్జర్ పెట్టలేకపోయాం, అందుకని ఇంకో కార్డ్ కొన్నాం బయటికి వెళ్ళినప్పుడు. తర్వాత రోజు కెమెరా చార్జింగ్ అయిపోయింది.front deskలో అడిగితే కన్వర్టర్ పంపించారు.
ఫ్లైట్ టైం కన్నా చాలా ముందుగానే చేరుకున్నాం. అప్పటికి మా ఫ్లైట్ చెక్-ఇన్ కూడా మొదలుపెట్టలేదు. కాసేపయ్యాక చెక్-ఇన్ చేసి లోపలికెళ్లి Duty free షాప్స్‌లో తిరిగాం. ఒక గంటాగి చూస్తే ఫ్లైట్ 1 గంట డిలే అని చూపించింది. ఆ గంట కాస్త అలా అలా లేటయ్యి 5 గంటలు అక్కడే వెయిట్ చెయ్యాల్సొచ్చింది.అసలే నిద్రపోయే టైం, దానికి తోడు చాలా అలసిపోయి ఉండటంతో అంతసేపు అలా కూర్చోవడం మా వల్ల కాలేదు.  నేనైతే అలానే కూర్చుని చాలా సేపు నిద్రపొయా. చివరికి ఫ్లైట్ ఎక్కాక మధ్యలొ తినడానికి తప్ప దిగేవరకు నిద్రపోయా.
here comes New York and end of my trip ఆదివారం మధ్యాహ్నం అయింది వచ్చేసరికి, మళ్ళీ రేపటి నుండి ఆఫీస్‌కెళ్ళాలి. కాకపొతే ఇన్ని రోజులు ఈ దేశం లో ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఇప్పటి నుండి ఇక్కడ నాకోసం ఒకరుంటారు, నేను కూడా part of one family with 2 members. మరి పెళ్ళి చేసుకోవడానికే కదా ఈ ఇండియా ట్రిప్ :):)

Wednesday, May 21, 2014

దుబాయ్ ట్రిప్ - Day 3 contd..

ఆ తర్వాత రయ్యిమని బండిని ఇసుకలోకి తీస్కెళ్లాడు.అలా తీస్కెళ్లడం తీస్కెళ్లడం గంట వరకు ఆపకుండా గాల్లో నడిపినట్టు డ్రైవ్ చేసాడు. నాకైతే సగం సేపు బండి  పడిపోతుందేమో, ఆ ఎగుడు దిగుడుగా ఉన్న ఇసుకలో జారిపోతుందేమో అనిపించింది. ఒక్కోసారి పక్కకి తిప్పినప్పుడు ఇసుక బండి కన్నా పైకి లేచి, కార్ అద్దాలన్నీ మూసుకుపోయి ఇసుకలో మునిగిపోతున్నామేమో అనిపించింది.అలా గంట సేపు తిప్పి తిప్పి  ఎడారి మధ్యలో ఒకచోట ఆపాడు. ఈలోపు ఇంకో 3,4 ఇలాంటి వెహికిల్స్ కూడా వచ్చి ఆగాయి. అక్కడ ఒక 10 నిమిషాలు దిగి ఫొటోస్ తీసుకున్నారు అందరు. ఈలోపు ఒక షేక్ falcon ని పట్టుకొని అక్కడికొచ్చాడు.  అతని దగ్గరికెళ్లి దాన్ని పట్టుకొని ఒక ఫొటో తీసుకున్నాం.

అక్కడి నుండి తీసుకెళ్ళి మమ్మల్ని ఎదారి మధ్యలో ఉన్న ఒక క్యాంప్‌లో దింపాడు. అప్పటికే అక్కడ చాలా వాహనాలున్నాయి.ఒక్కొక్క బండిలో వచ్చిన వాళ్లందరికి కలిపి ఒక table ఉంటుదనీ, మా table నంబర్ చెప్పి, అక్కడికెళ్ళి మేం ఐదుగురం కూర్చోవచ్చనీ చెప్పాడు. camel ride, టీ, రాత్రి భోజనం టూర్ ప్యాకేజిలో ఫ్రీ అని, ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి కావల్సినవి కొనుక్కొవచ్చనీ, రాత్రి మళ్ళీ ఇక్కడికే వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పాడు.  అక్కడ ATV రైడ్ ఉంది, దాని గురించి అడిగితే వెళ్ళి ఇప్పుడే టికెట్ తీసుకోండి, తర్వాత చాలా మంది వస్తారు దొరకడం కష్టం అవుతుంది అంటే, ఫస్ట్ అక్కడికెళ్లాం. అప్పటికి పెద్దగా క్యూ లేదు కాబట్టి త్వరగానే దొరికింది.

అదైపోయాక camel ride. అంటే ఓ... రైడ్ కాదు. జస్ట్ దాని మీద ఎక్కించి పదంటే పదే అడుగులు అటూ ఇటూ తిప్పి దింపేస్తారు.కాకపోతే ఫొటోస్ తీస్తారు, అవి కొనుక్కోవచ్చు మనకి నచ్చితే. ఇవి రెండూ క్యాంప్ బయట ఉన్నాయి. తర్వాత క్యాంప్ లోపలికి వెళ్ళి మా table ఎక్కడుందో చూసుకొని స్టాల్స్ ఏమున్నాయో చూద్దామని వెళ్లాం. మెహెందీ, హుక్కా, జ్యూస్, స్వీట్ కార్న్ ఇలాంటి స్టాల్స్ ఉన్నాయి కొన్ని. వాటి మధ్యలో అప్పుడు కనిపించింది అస్సలు ఊహించని స్టాల్. వాళ్ళ దగ్గర కొన్ని బుర్ఖాలు, షేక్ డ్రెస్సులూ ఉన్నాయి. వాటిలో మనల్ని ఫొటొస్ తీస్తారు. వచ్చినప్పుడే అనుకున్నా అని చెప్పాగా బుర్ఖాతో ఫొటో తీసుకుంటే బావుండు అని. యాహూ... అనుకొని వెళ్ళి టక్కున బుర్ఖా వేసుకొని నిల్చున్నా. వేరే వాళ్ళని తీస్తున్నారు అప్పుడు, వాళ్లదవగానే    మేం వెళ్లాం. కత్తి పట్టుకొని, ఇంక కొన్ని అరబిక్ వస్తువులు పట్టుకొమ్మని ఫొటోస్ తీసారు.ఇవీ, ఇందాక camel దగ్గర దిగినవి అన్ని కలిపి రాత్రి వెల్లిపోయే ముందు కలెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు.  తర్వాత కొంచెం టీ, కొన్ని స్నాక్స్ ఇచ్చారు. అవి తెచ్చుకొని మా table దగ్గర కూర్చున్నాం. table అంటే table కాదు. ఒక పరుపు లాంటిది  కొంచెం ఎత్తులో వేసి, దాని చుట్టు దిండుల్లాంటివి వేసారు. వాటన్నిటినీ   ఒక స్టేజ్ చుట్టూ వేసారు.

సాయంత్రం కావడంతో ఎడారి లో ఉన్నా హాయిగా చల్లగా మంచి వాతావరణం ఉంది. స్నాక్స్ అయ్యాక ఒక బెల్లీ డ్యాన్స్, ఒక షో ఉండె(డ్యాన్స్ ప్లస్ జిమ్నాస్టిక్స్ టైపులో), మంచి మ్యూజిక్‌లో.

తర్వాత భోజనం వచ్చి తీస్కెళ్లమని అనౌన్స్ చేసారు.భోజనం కూడా పర్లేదు బానే ఉంది.తినే సరికి రాత్రి 9 అయింది. అందరితో పాటే బయటికి వెళ్ళి మా డ్రైవర్‌ని వెతికి పట్టుకొని రిటర్న్ బయల్దేరాం. వెళ్ళే అప్పుడు అంత భయం అవలేదు కాని, ఇప్పుడు చీకట్లో అంత వేగంగా నడిపిస్తుంటే కాస్త భయం వేసింది. అంత చీకట్లొ, రోడ్ మీద కన్నా వేగంగా తీసుకొచ్చాడు. అసలే అక్కడ దారి లాగ కూడా   లేదు అనుకుంటే ఎదురుగా కూడా వాహనాలొస్తున్నాయి. బస్సుల్లో వచ్చిన వాళ్లని రోడ్ వరకు తీస్కెళ్ళి దింపాలట అందుకోసం. ఇసుక దాటేసి కొంచెం దూరం వచ్చాక మధ్యాహ్నం టైర్లలోంచి గాలి తీసేసారు  కదా, అక్కడే ఆపి గాలి నింపారు మళ్ళీ రోడ్ మీద డ్రైవ్ చెయ్యడానికి వీలుగా. వచ్చే అప్పుడే చూసాం, తిరిగి వెళ్ళే దార్లోనేGlobal village అని మేం వెల్దాం అనుకున్న ఇంకో ప్లేస్ ఉందని. రాత్రి ఎప్పటి వరకు ట్యాక్సీలు ఉంటాయని డ్రైవర్ ని    అడిగితే ఏం ప్రాబ్లం ఉండదు,అసలు అది రాత్రే తెరుస్తారని అప్పటి వరకు ఉంటాయని చెప్పటంతో, మమ్మల్ని మధ్యలొ అక్కడ దింపెయ్యమని అడిగాం. మాతో పాటు ఆ ఫ్రెంచ్ జంట కూడా దిగేసరు అక్కడే. వెళ్ళి టికెట్ కౌంటర్ లో అడిగితే రాత్రి 1 వరకు తెరిచే ఉంటుందని చెప్పారు. అది చాలా పెద్ద ఎగ్జిబిషన్ లాగ ఉంది. అన్ని దేశాలకి ఒక్కొక్క సెట్ లాగా వేసి లోపల ఆ దేశానికి సంభందించిన వస్తువులు అమ్ముతున్నారు. అన్నిట్లోకి మహల్ లాగ వేసిన మన దేశందే చాలా బావుంది.

 అక్కడ ఒక గంట సేపు తిరిగి, ఇంకా చూడ్డానికి  పెద్దగా ఏమి అనిపించకపొయేసరికి  బయటికి వచ్చేసాం. ట్యాక్సి తీసుకొని హోటల్‌కి వచ్చేసాం. ఇంకా ఒక్కరోజే మిగిలింది,ఒక్కరోజు కూడా కాదు రేపు రాత్రి ఫ్లైట్.ఇంకో రోజులో మళ్ళీ వెళ్లి రొటీన్‌లో పడిపోవాలి.. :(

Thursday, May 8, 2014

దుబాయ్ ట్రిప్ - Day 3

ఈరోజు desert safari కి బుక్ చేసాం. ఎవరైనా ఏజెంట్ నుడి బుక్ చేసుకోవచ్చు లేదా ఆ హోటల్ లో టూరిస్ట్ సెంటర్ నుండి అయినా బుక్ చేసుకోవచ్చు. కాని మనం ఎవరి దగ్గర నుండి చేసినా సరే అన్ని టూర్స్  ఒకే సమయం లో మధ్యాహ్నం 3 గంటలకి మొదలవుతాయి. మూడింటికి మనం బుక్ చేసిన ట్రావెల్స్ నుండి కారు పంపిస్తారు, తిరిగి వాళ్లే రాత్రి 9:30 కి డ్రాప్ చేస్తారట. ఈ రోజూ ప్రొద్దున ఏమి ప్లాన్స్ లేవు కాబట్టి మెల్లగా లేచి అయ్యి కిందికొచ్చాం. నిన్న visitor center లో ఇంకా దగ్గర్లో చూడదగిన ప్రదేశాలు ఏమున్నయో కొన్ని చెప్పారు. వాటి గురించి వివరాలు కనుక్కోవడానికి మా దగ్గర ఇంటర్‌నెట్ లేదుగా.  అందుకే మళ్ళీ అక్కడికే వెళ్లి వాటి గురించి కనుక్కున్నాం. అక్కడికి కొంచెం దూరం లో miracle garden అని ఒక ప్లేస్ ఉందనీ,మొత్తం పూలతో చేసిన గార్డెన్ అని కొన్ని ఫోటోస్ చూపించింది.అక్కడి నుండి ఇంకాస్త దూరం వెళ్తే global village, అన్ని దేశాల సంసృతులు ప్రతిబంబించేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఉంటుందట. కాని అది రాత్రి సమయాల్లో వెళ్తే బావుంటుందని చెప్పింది. దాని ఫొటోస్ కూడా చూపించింది, అంత బాగా ఏమి అనిపించలేదు అవి. అందుకని మిరకిల్ గార్డెన్ వెళ్దాం అనుకున్నాం. బయటికి వెళ్లి టాక్సి తీసుకుంటే 20 నిమిషాల్లో అక్కడికి తీసుకెళ్ళాడు. ఇక్కడ ట్యాక్సిల్లో తిరగడం USలో అంత కాస్ట్లీ అనిపించలేదు. అది ఒక పెద్ద పార్క్‌లాగా ఉంది.
లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకొని వెళ్ళాం. చాలామంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ.లోపలికి వెళ్లాక ఎటు చూసినా పువ్వులే. లోపలికి అడుగు పెట్టగానే పెద్ద నెమలి పూలు ఇలా welcome చెప్పాయి.(అంటే అవేవో కొత్తరకం పూలు కాదు నెమలి ఆకారంలో పెట్టినవి)



రంగు రంగుల పూలు, రకరకాల ఆకారాల్లో అలంకరించిన పూలు. అన్నీ పూలే, పూలు,ఆకులు తప్ప కొమ్మలు ఏమి లేవు.  చాలా పెద్దగా ఉంది ఆ గార్డెన్. లోపలికి వెళ్ళి చూడగానే అరె బావుంది బావుంది అనుకొని, చూస్తూ నడుస్తూ పోయాం.


పాత కార్లు, టైర్లు, గొడుగులు చివరికి మనం షాప్స్ లో వాడే షాపింగ్ కార్ట్ లాంటి వాటిలో కూడా పూలు నింపేసారు.పూలతో చిన్న ఖలీఫా కూడా కట్టేసారు.

ఎంత నడిచినా ఒక ఇంకా వస్తునే ఉంది, కాని ఒక చివరికి రావట్లేదు. పైన మండే ఎండ,నడిచి నడిచి అబ్బా.. అన్నీ పూలే కదా ఏముంటుంది ఇంకా కొత్తగా అనిపించింది. ఈలోపు  అక్కడ క్యాంటీన్ లాగ చిన్న ఫుడ్ కోర్ట్ కనిపిస్తే కూర్చుని ఒక ఐస్‌క్రీం తిని, తిరిగి వచ్చిన దార్లోనే వెనక్కి వచ్చేసాం. అక్కడ కొన్ని చిన్న చిన్న రైడ్స్ అవీ ఉన్నాయి.
ఇంటికి వచ్చాక దీని గురించి గూగుల్ చేస్తే తెలిసింది, అది ప్రపంచం లోనే అతి పెద్ద ఫ్లవర్ గార్డెన్ అంట. పోయిన సంవత్సరం వాలెంటైన్స్ డే కి ఓపెన్ చేసారట దీన్ని.
అక్కడి నుండి హోటల్ కి వెళ్ళి, లంచ్ చేసి మూడింటి కల్లా లాబీలోకి వచ్చి సఫారి కోసం మమ్మల్ని తీసుకెళ్లే వాహనం కోసం వెయిట్ చేసాం. సరిగ్గా  మూడు గంటలకు ఒకతను వచ్చి మమ్మల్ని తీస్కెళ్లాడు.
మనం టూర్ బుక్ చేసుకున్న కంపనీ వాళ్ళు, కొందరు కొందర్ని ఒక గ్రూప్ లాగా ఒక వాహనం లో తీసుకెళ్తారు.ఒక్కొక్కరికి250AED  మనం వారికి ముందే పే చెయ్యాలి.
అతను తీసుకొచ్చిన వెహికిల్ ఒక 7 సీటర్ SUV. అప్పటికే డ్రైవర్ కాకుండా ముగ్గురు ఉన్నారు అందులో. వెనకాల సీట్లో ఒక జంట, ఫ్రాన్స్ నుండి వచ్చారట వాళ్ళు. ముందు డ్రైవర్ పక్కన ఒకతను. పాకిస్తానీ, కెనడా సెటిల్ అయ్యాడట.మేము మధ్య సీట్లో కూర్చుని ఒకర్నొకరం పరిచయం చేసుకున్నాం. అక్కడి నుండి సిటీ దాటి దాదాపు 45 - 50 నిమిషాలు ప్రయాణం చేసి కొంచెం చిన్న ఊరు లాంటి ప్రదేశానికి చేరుకున్నాం.
దగ్గర్లో చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్‌తో చిన్న ప్యాలస్ లాంటీ బిల్డింగ్ ఉంది. అది దుబాయ్ షేక్‌ది, ఎప్పుడూ ఉండడానికి కాదు కాని అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటాడని చెప్పాడు డ్రైవర్. ఒక చోట కార్  ఆపి అందర్నీ దిగమన్నాడు. కిందికి దిగాక చూస్తే అతను ఆపింది చిన్న మెకానిక్ షాప్ దాని లాంటి ముందు.అందరు దిగగానే ఒక మెకానిక్ కార్ దగ్గరికి వచ్చాడు.అయ్యో ఇదేంటి కార్‌కేమన్నా అయ్యిందా, మళ్ళీ ఈ రిపేర్ అదీ ఎంత టైం పడుతుందో అనుకున్నాను.ఈలోపు డ్రైవర్ చెప్పాడు, ఎడారి లోకి వెల్తున్నాం కదా ఇప్పుడు అందుకని టైర్స్‌లో గాలి  తగ్గిస్తున్నారట. అప్పుడు తక్కువ ప్రెషర్ ఉండి, ఆ ఇసుకలో డ్రైవ్ చెయ్యడానికి వీలుగా ఉంటుందట.లేకపొతే పడిపోయే ప్రమాదం ఉంటుందట. అక్కడికి కొంచెం దూరం లోనే  ఎడారి మొదలవుతుంది కాబట్టి ఇక్కడే గాలి తగ్గించేస్తున్నామని చెప్పాడు. అక్కడ చాలా వాహనాలు ఆగి ఉన్నాయి, అన్నిట్లోనూ అలాగే చేస్తున్నారు. అక్కడ మన దగ్గర జాతర్లో ఉన్నట్టు కొన్ని చిన్న చిన్న  షాపులు ఉన్నాయి, ఏదైనా కొనాలనుకుంటే వెళ్ళొచ్చు, కొంచెం సేపు ఆగుతాం అని చెప్పాడు.వాటిలోకి వెళ్లి మళ్లీ ఒక fridge magnet కొన్నాం.
అక్కడి నుండి బయల్దేరిన పది నిమిషాలకు మెల్లగా ఎడారి లాగా ఉన్న ప్రదేశం లోకి ప్రవేశించాం.   అక్కడికి రాగానే డ్రైవర్ మా అందరికి మనిషికొక పాలిథిన్ కవర్ ఇచ్చి,ఇప్పుడు ఇసుక తిన్నెల్లో అటూ ఇటూ తిప్పుతాను, ఎవరికైనా వాంతికొస్తే అందులొనే చెయ్యాలి, ఒకవేళ కార్లో చేస్తే 500AED ఫైన్ వేస్తారు కంపనీ వాళ్లు అని చెప్పాడు.ఇంక కార్లో పై భాగంలో , పక్కన పట్టుకోవడానికి గ్రిప్ ఉండేలా కొన్ని rods లాంటివి ఉన్నాయి, వాటిని పట్టుకొండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పాడు. తర్వాత..

Monday, May 5, 2014

దుబాయ్ ట్రిప్ - Day 2

దుబాయ్‌లో నాకు వరసకి మామయ్య ఒకరు ఉన్నారు. మా బాబాయి కి చాలా క్లోజ్ అతను.
మేము ఇలా దుబాయ్ ట్రిప్ అనుకుంటున్నాము అని ఇంట్లో చెప్పగానే మా బాబాయి వెళ్ళినప్పుడు తనని కలవమని, అక్కడ ఏమైనా కావాలంటే తను హెల్ప్ చేస్తారని చెప్పి, అక్కడున్నప్పుడే కాల్ చేసి మాట్లాడిపించారు ఒకసారి. నిన్న అక్కడికి చేరగానే ఆయనకి కాల్ చేసాం. రేపు మా ప్లాన్ ఏంటి అంటే ముందె అనుకున్నట్టు సాయంత్రం 5 కి burj khalifa పైకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసాం, ఇంకా ప్రొద్దున అంతా సిటి చుడ్డానికి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పాం. అయితే మామయ్య వాళ్లకి ట్రావెల్స్ ఉందనీ, రేపు సిటి టూర్ కోసం టికెట్స్ ఏమీ తీసుకోవద్దనీ, ఉదయం 9 కల్లా వాళ్ళ ట్రావెల్స్ నుండి కారూ, డ్రైవర్ నీ పంపిస్తానని చెప్పారు.
ఆ రోజు ప్రొద్దున్నే లేచి తయారయ్యి, ఇంకా 9 అవడానికి కాస్త టైం ఉందని , అక్కడ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ ఏమీ లేదు కాబట్టి రెస్టారెంట్‌లో కింద బ్రేక్‌ఫాస్ట్  ఏముందో చూద్దాం అని వెళ్ళాం.  రూం లోనే మెను చూసాం, చాలా వెరైటీస్ ఉన్నాయి కాని ప్రైస్ ఎంతో లేదు. ఎలాగూ ఎక్కువే ఉంటుంది కాని చూద్దాం ఒక 100dirhams వరకి ఉంటే ఆలోచిద్దాం అని వెళ్ళాం. రెస్టారెంట్ చాలా పెద్దగానే ఉంది కాని ఒకే ఒక్క టేబుల్ దగ్గర ఇద్దరు తప్ప ఎవరూ లేరు. అక్కడ ఫ్రంట్ డెస్క్ దగ్గర ఉన్న అతను బ్రేక్‌ఫాస్ట్ బఫె అని చెప్పాడు. ఎంత అంటే 170 aed అంట. ఏం పర్లేదు తిందాము అంటున్నా కాని నేనే we will be back అని చెప్పేసి తీసుకొచ్చేసా అక్కడి నుండి. మరి 170 AED అంటే దాదాపు 50$. బ్రేక్‌ఫాస్ట్ కి అంత అవసరం లేదు కదా, ఏదొ లంచ్ అయినా తినేస్తాం కాని అంత ప్రొద్దున ఎక్కువ ఎలాగూ తినలేం (ముందు రోజు సిటి టూర్ కోసం బుక్ చేద్దాం అని చూస్తే per person 220aed అలా ఉన్నాయి టూర్ ప్యాకేజ్. ఒకరోజు సిటి టుర్ కెళ్ళే డబ్బుల్తో ఎందుకులే అని ).
కిందికొచ్చి ఒక 5 - 10 mins  wait చేసాక మమ్మల్ని pick చేసుకోవడానికి ఒకతను వచ్చాడు. కార్‌లో కూర్చున్నాక అతన్ని ప్లాన్ అడిగితే ఎక్కడెక్కడికి తీసుకెల్తాడో చెఫ్ఫాడు. వెళ్తూ వెళ్తూ డ్రైవర్‌తో మాటలు కలిపితే, తనూ తెలుగు అతనే అని, ఇక్కడికి వచ్చి 6, 7 సంవత్సరాలు అవుతుందనీ తన గురించి కొన్ని వివరాలు చెప్పాడు.
అక్కడి నుండి బయల్దేరి, దార్లో బ్రేక్‌ఫాస్ట్ చేసేసి palm jumeirah island కెళ్ళాం. అది palm tree ఆకారం లో నిర్మించిన ఒక artificial island. మధ్యలో రోడ్డు, అటూ ఇటూ ఉన్న ఆకు షేప్స్ పైన పెద్ద పెద్ద బిల్డింగ్స్.
Google Image

షారుఖ్ ఖాన్ కి అక్కడ ఒక ఇల్లుందని ఎప్పుడో చదివిన గుర్తు, అదే విషయం అతన్ని అడిగితే అవునని చెప్పి అటు వైపు వెళ్ళినప్పుడు చూపించాడు. ఈ వరుసలోనే ఆ ఇల్లుంది అని.  మనము main trunk పైన ఉన్న రోడ్ పైనే తిరగగలం.ఒక్కో ఆకు లాంటి షేప్ మొదట్లో సెక్యూరిటి గేట్ ఉంటుంది. పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలరట.
అలా ఆ రోడ్ పైన కొంచెం దూరం వెళ్ళి ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆపాడు. అదే అట్లాంటిస్. ఇది palm మీద నిర్మించిన మొదటి రిసార్ట్ అట. మమ్మల్ని దాని ముందు దింపి, మేము అటు ఇటు కాస్త తిరిగి చూసేలోపు అతను కార్ పార్క్ చేసి వచ్చాడు. అక్కడికి main land నుండి ఒక ట్రైన్ కూడా  ఉంటుందట.   అట్లాంటిస్ లోపలికి వెళ్ళి కాసేపు తిరిగిచూసి బయటికి వచ్చాం. లోపల కొన్ని నీళ్ళళ్ళో చేసే ఆక్టివిటీస్ ఉన్నాయి కాని మేము వాటికేం వెళ్ళలేదు. అక్కడ ఒక్కరు కూడా లోకల్ వాళ్ళు లేరు.  అందరూ టూరిస్టులే..
బయటికి వచ్చి రోడ్ దాటగానే మొత్తం సముద్రం. అక్కడ కాసేపు కూర్చున్నాం అలా నీళ్ళని చూస్తూ.
అక్కడి నుండి చూస్తుంటే దూరంగా పొగ మంచు మధ్యలోంచి అస్పష్టంగా బుర్జ్ అల్-అరబ్ కనిపిస్తుంది. ఇవి రెండే మా ట్రిప్ లో ప్రధానంగా చూద్దాం అనుకున్నవి.  
ఆ వాతావరణం,ఆ ప్లేస్ అంతా బావుంది కాని నాకు ఐలాండ్ మీదకి వచ్చినట్టే అనిపించట్లేదు. ఇప్పుడేదో బీచ్ దగ్గరికి వచ్చినట్టూ, ఇందాక trunk లో మామూలు రోడ్ పైన వచ్చినట్టే అనిపిస్తుంది, నాకు ఆ palm పైన ఉన్నట్టు ఆ ఫీలింగ్ రాలేదు, అదే మాట అంటుంటే డ్రైవర్ చెప్పాడు అయితే మిమ్మల్నొక చోటికి తీసుకెల్తా అని.  అక్కడి నుండి మమ్మల్ని తీసుకొని మేము వచ్చిన దార్లో కాకుండా, ఇంకా ముందుకి తీసుకెళ్ళాడు. అది ఇంక plamకి ఇటు వైపు చివర అట, అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్లలేం, main landకి వెళ్ళాలంటే ఇందాక వచ్చిన ఒకటే దారి. ఇక్కడ ఇంకా కొన్ని కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అక్కడ రోడ్ పైన ఒక పక్కన ఆపి మమ్మల్ని దింపి వెళ్ళిపోయాడు.ఇంకాస్త ముందుకి వెళ్ళి కార్ వెనక్కి తిప్పి తీసుకురావడానికి.
ఇందాకటి కన్నా ఈ చోటు చాలా నచ్చింది నాకు. మధ్యలో రోడ్డు, రోడ్ కి రెండు వైపులా నీళ్ళు. ఒక వైపు అట్లాంటిస్, ఒక వైపు అల్-అరబ్. ఇంకా palm మీద మేము నిల్చున్నది కాకుండా కొంచెం దూరం లో ఉన్న ఆకు షేప్ కూడా తెలుస్తుంది. దాని మీద వరుసగా బొమ్మరిల్లు పేర్చినట్టు బిల్డింగ్స్.ఈలోపు అతను కార్ వెనక్కి తిప్పుకొని ఒక 10-15 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. సాధారణంగా టూరిస్టులని ఇంత ముందుకు ఎవరు తీసుకురారు అట. అక్కడి నుండి ఈ view కూడా అందరికి తెలియదు, తను ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు ఇటు వైపు వచ్చాడట  ఇప్పుడు మాకు చూపిద్దాం అని తీసుకువచ్చాడట.soo nice..  అనుకున్నా.. అసలు అక్కడికి వెళ్ళకపోతే నాకు అసంతృప్తిగా అనిపించేదేమో.  
అక్కడి నుండి అల్-అరబ్ వైపు బయల్దేరాం. దార్లో అడిగాం అతన్ని అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయని. చాలా కఠినంగా ఉంటాయట. ఒకసారి రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే 2000 aed వరకు ఫైన్ ఉండొచ్చట. ఈ లెక్కన చూస్తే US లోనే నయం ఏమో అనిపించింది. లైసెన్స్ రావడం కూడా కష్టం అనీ, చాలా ఖర్చు అవుతుందనీ చెప్పాడు. దార్లో వెళ్తూ దుబాయి షేక్ భవనాన్ని చూపించాడు. అక్కడ వేరే దేశం సిటిజన్స్ ఏవైనా ఆస్తులు కొంటే పూర్తిగా మనవి కావు, 99 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ తో మాత్రమే కొనగలం అట. కాని ఈ మధ్య కాలం లో, కొన్ని ప్లేసెస్‌లో మాత్రం మొత్తంగా మనమే కొనుక్కోవడానికి అనుమతి ఇస్తున్నారట.
దూరం నుండి చూస్తే బుర్జ్ అల్-అరబ్, జుమెరా బీచ్ హోటల్ కలిసిపొయి ఒకే బిల్డింగ్ లాగా అనిపించాయి. దగ్గరికెళ్ళాక కాని నమ్మలేకపోయా అవి 2 వెర్వేరు అని. అక్కడ కాసేపు తిరిగి souvenirs కొన్నాం. ఇవే అవి.నాకు భలే నచ్చేసాయి.
my Image ;)

అప్పటికే లంచ్ టైం అయిపోయింది.అక్కడ కాసేపు తిరిగి కొన్ని ఫోటోస్ తీసుకొని, ఎక్కడికన్నా మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళమన్నాం. అక్కడ చాలా రెస్టారెంట్స్‌లో ఇండియన్, చైనీస్, అరబిక్ ఒకే దాంట్లో ఉన్నాయి, దేనికదే విడిగా లేకుండా. లంచ్ చేసాక రివర్ వాక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. బీచ్లో కాసేపు వాకింగ్ చేసాం. ఇసుకలో చేసిన్ కొన్ని బొమ్మలున్నాయి అక్కడ. చాలా మందే బికినిల్లో కనిపించారు.
ఎక్కువ సేపు నడవలేకపోయాం అక్కడ, చాలా  వేడిగా అనిపించింది. అందుకని కొంచెం సేపు ఉండి ఎలాగూ ఖలీఫా పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకున్న టైం అవుతుందని బయల్దేరాం, మమ్మల్ని దుబాయి మాల్ లో దింపేసి అతను వెళ్ళిపోయాడు. ఖలీఫా పైకి వెళ్లడానికి ఎంట్రన్స్ మాల్ లోనే ఒక వైపు నుండి ఉంది. అక్కడికి వెళ్ళి నెల రోజుల ముందే  బుక్ చేసిన టికెట్స్ ని కలెక్ట్ చేసుకొని పైకి వెళ్లడానికి ఉన్న క్యూలో నిల్చున్నాం. లోపల దానికి సంబంధించిన చాలా వివరాలు ఉంచారు. ప్రపంచంలోనే ఎత్తైన టవర్, మాన్ మేడ్ వండర్ అనీ, ఇంకా మిగతా ఎత్తైన భవనాలేంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి లాంటి వివరాలన్ని ఉన్నాయి. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా 2 times ఎక్కువ ఎత్తు అట.
అవి చదువుతూ ముందుకెళ్లాక సెక్యూరిటి చెక్, అది దాటి ముందుకెల్లాక మళ్ళీ కాసేపు లైన్‌లో నిల్చున్నాం ఎలివేటర్ కోసం. అందులో 200 అంతస్తులకు పైగా ఉన్నాయట కాని మనల్ని 120 వ అంతస్తు వరకే తీసుకెళ్తారని తెలిసింది. అయ్యో పై వరకి తీసుకెళ్లరా అనిపించింది.
ఎలివేటర్ లో ఒక నిమిషంలో 120 వ అంతస్తుకి చేరుకున్నాం. కాని పైకెళ్లాక నాకు కొత్తగా ఏమి అనిపించలేదు. sears tower, rockefeller center top వెళ్లాం కాబట్టి పైకెల్లాక అంత ఎగ్జైట్‌మెంట్ అనిపించలేదు .   sears tower లో పైకెళ్ళాక మనం ఒక గ్లాస్ అద్దం మీద నిలబడొచ్చు. కింద ఏమి ఉండదు. ఆ ఫీలింగ్ మాత్రం unique. ok ok ఆ విషయం వదిలేస్తే, నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నాం అన్నా కదా ఎందుకంటే అక్కడి నుండి sun set బావుంటుందని చదివా, ఆ సమయాల్లో లిమిటెడ్ టికెట్స్ ముందే అమ్ముడయిపోతాయి. సాయంత్రం 4,5 టైం లో వెళ్తే day view, night view రెండూ చూడొచ్చు, ఇంకా సుర్యాస్తమయం కూడా చూడొచ్చు అని. ఏరోజూకైనా టికెట్స్ సరిగ్గా 30 రోజుల ముందు తెరుస్తారు .  ఆన్‌లైన్లో తీసుకుంటే టికెట్ ఒక్కటి 125aed, అదే మనం అక్కడికి వెళ్ళి అప్పుడే కొనుక్కుంటే 400 aed. అందుకని ముందే ఆన్‌లైన్లో కొనేసుకోవడం మంచిది.
ఒక వైపు మొత్తం చిన్న చిన్నగా కనిపిస్తున్న చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకొ వైపు అసలు మొత్తం ఎడారిలాగా ఉన్న ప్రదేశం. అక్కడ బయటికి ఓపెన్ స్పేస్ ఉండి, చుట్టు గ్లాస్ గోడలు పెట్టారు, బయటికి చూడడానికి వీలుగా. అక్కడ అంత ఎత్తులో బయటికి వెళ్ళగానే చాలా గాలి, చల్లగా అనిపించింది.
నిన్న కింద నుండి చూసిన వాటర్ ఫౌంటెన్ పై ఉంది మొత్తం వ్యూ ఉంది. అప్పుడు అర్థం ఐంది,  నిన్న అసలు సగం ఫౌంటెన్ కూడా కనిపించలేదు, అసలు చాలా పెద్దగా ఉంది అని.
6 కి ఫౌంటెన్ మొదలవగానే అందరు బయటికి వచ్చెసారు. పైనుండి చూస్తుంటే ఇంకా బావుంది.
అలా సూర్యుడు ఆ ఎడారి పైనుండి భూమిలోకి వెళ్ళేవరకి చూస్తూ ఉన్నాం. సూర్యుని కంటే ఎత్తులో ఉండి ;). (అలానే అనిపించింది మరి).
అప్పుడే sun-set అయ్యిందేమో కిందికి వెళ్ళడానికి కూడా ఎలివేటర్ దగ్గర చాలా క్యూ ఉండె. అలా కిందికి వచ్చేసి టాక్సి తీసుకొని హోటల్ అడ్రస్ చెప్పి, అడిగాం దానికి దగ్గర్లో ఏమన్నా మంచి రెస్టారెంట్స్  ఉంటే తీసుకెళ్ళమని. అతను హోటల్‌కి దగ్గర్లోనే తినడానికి ఒక మంచి ప్లేస్ చూపించి మమ్మల్ని దింపి, మేముండే హొటల్ వరకి ఎలా నడుచుకుంటూ వెళ్లొచ్చో చూపించాడు. 
మంచిగా తినేసి ఆ చల్లని గాలిలో (definiteగా న్యూ  యార్క్ లో ఉండే లాంటి చల్లటి చచ్చే గాలి కాదు. మంచి చల్లని పిల్ల గాలి :))
మెల్లగా నడుచుకుంటూ రూంకి వచ్చేసాం... రేపు వెళ్ళబోయే exciting deset safaari గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయా..
Al-arab
Atlantis


             
Water fountain view from top of Burj Khalifa

Thursday, May 1, 2014

దుబాయ్ ట్రిప్ - Day 1

మొన్న ఇండియా వెళ్ళొచ్చా కదా. వస్తూ వస్తూ దార్లోనే కదా అని ఒక 3 డేస్ దుబాయ్ లో ఆగి, visit చేసొచ్చాము.
ఇండియా టిక్కెట్ బుక్ చేసే అప్పుడే, return tripలో దుబాయ్ లో ఆగుదాం అనుకున్నాం. emiratesలో టికెట్ బుక్ చేసుకుంటే  ఆన్‌లైన్లో visa apply చెయ్యొచ్చు. round trip బదులు multi-destination select చేసుకుని, వెళ్ళే అప్పుడు direct US to Hyd తిరిగి వచ్చేటప్పుడు, Hyd to Dubay అక్కడ 3 రోజులు halt then Dubay to NewYork అని plan చేసుకున్నాం.
ఆ రోజు ప్రొద్దున 10 కి hyd లో flight ఎక్కితే మూడున్నర గంటలు ప్రయాణించి, లోకల్ టైం 12:30 కి దుబాయ్ లో లాండ్ అయ్యాం. ఆన్‌లైన్లో అప్లై చేసిన్ తర్వాత వీసా మనకి e-mail చేస్తారు, ఆ ప్రింట్ ఔట్ పట్టుకెళ్తే సరిపోతుంది దుబాయ్‌లో ఇమిగ్రేషన్‌కి.
ఏర్‌పోర్ట్ లో ఆఫీసర్స్ అంతా చక్కగా షేక్ డ్రెస్స్ యునిఫాంలో ఉన్నారు.  ఇదివరకు చాలా సార్లు చూసాం కదా ఇప్పుడు చూస్తుంటే కొత్తగా అనిపిస్తుందేంటి అనుకున్నా. సినిమాల్లో దుబాయ్ షేక్ అనగానే అరబ్ డ్రెస్‌లో చూపిస్తారు, కాని గట్టిగా అలోచిస్తే ఆ డ్రెస్ నేను సినిమాలో తప్ప బయట ఎప్పుడూ చూడలేదనిపించింది. నాక్కూడా ఒకసారి బుర్ఖా వేసుకొని ఒక ఫోటో దిగితే బావుండు అనిపించింది.
లగ్గేజ్ collect చేసుకొని, బయటికి వచ్చి taxi తీసుకుని, డ్రైవర్ కి Hotel address చెప్పాం. నాకైతే ఆ రోడ్స్ US కన్నా కొత్తగా, ఇంకా neatగా అనిపించాయి. hotel check-in చేసి కాస్త fresh up అయ్యెసరికి 3:30-4 అయిపోయింది. ఆ రోజుకి పెద్దగా plans ఏం పెట్టుకోలేదు కాబట్టి, కిందకి వెళ్ళి అక్కడ visitor center లో అక్కడికి దగ్గరలో ఏమన్నా visiting places అదీ మిగతా సగం రోజులో cover చేసేవి  ఉన్నయేమో అని అడిగాం.   hotel కి దగ్గర్లోనే మెట్రో స్టేషన్ ఉందనీ, ట్రైన్ లో2,3 stops వెళ్తే దుబాయ్ మాల్ కి కాని ఎమిరేట్స్ మాల్ కి కాని వెళ్లొచ్చని చెప్పారు. స్టేషన్ కి ఎలా వెళ్ళాలో తెలుసుకొని బయల్దేరాం.దుబాయ్ visit    చెయ్యడానికి వచ్చి ఇక్కడ కూడా  షాపింగ్ ఏనా అనుకోకండి. ఊరికే చూడ్డానికే వెళ్ళాం.no shopping.
దుబాయ్ మాల్ కి వెళ్తే బయటి నుండి Burj khalifa view ఉంటది అని దానికే వెళ్దాం అనుకున్నాం.
station కి వెళ్ళి మాల్ కి టికెట్స్ తీసుకొని ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాం. ఎంతకీ ప్లాట్‌ఫాం  రాదు. లోపలే ఒక కిలొమీటర్ నడిచి ట్రైన్ఎక్కి దుబాయ్ మాల్ stopలో దిగాం.దిగాక మాల్ వైపు నడవటం మొదలు పెట్టాం, నడుస్తునే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాం.. ఎంతకీ మాల్ కనిపించదే... ఇంక నయం మధ్యలో moving platforms ఉన్నాయి కాబట్టి కొంచెమైనా ఓపిక వచ్చింది. నిజ్జంగా తక్కువలో తక్కువ ఒక 2,3 కిలోమీటర్స్ అయినా నడిచుంటాం.  పది సంవత్సరాలు తపస్సు చేసాక దేవుడు ప్రత్యక్షం అయినట్టు, ఫైనల్ గా ఆ వాక్ వే నుండే డైరెక్ట్ గా మాల్ లోకి ఎంటర్ అయ్యాం. నిజం చెప్పాలంటే అంతదూరం నడిచినందుకంటే, ట్రైన్ దిగగానే ఉంటుందేమో అనుకున్నాం కదా, ఇంకా ఎంత దూరం ఇంకా ఎంత దూరం అనుకొనే అలసిపోయామనిపించింది.
మాల్ లో ఇంకా కొత్తగా ఏముంది,అన్ని రకాల స్టోర్స్, దాదాపు అన్ని US బ్రాండ్స్, ఇంక నేను ఎప్పుడూ చూడని బ్రాండ్స్ చాలా ఉన్నాయి . ఏరియా ప్రకారం చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద మాల్ అట అది. bloomigdales, Michael Kors ఈ పేర్లన్నీ అరబిక్ లో చుస్తుంటే కొత్తగా అనిపించింది. అలా అన్ని షాప్స్ బయటినుండే చూసుకుంటూ, మధ్య మధ్యలో కొంచెం అందంగా కనిపించిన చోట ఫొటోస్  తీసుకుంటూ కాసేపు తిరిగాం. అయినా నా బుధ్ధి పోనిచ్చుకోకుండా ఒకటి, రెండూ షాపుల్లోకెళ్ళి రేట్స్ ఎలా ఉన్నాయో చూసా. దాదాపుగా ఇక్కడ ఉన్నంతే ఉన్నాయి.
కిందికి వచ్చాక చూస్తే చాలా  పెద్ద aquarium ఉంది. ఇంటికి వచ్చాక గూగుల్ చేసా, అది కూడా ప్రపంచంలో అతి పెద్ద aquarium లలో ఒకటి అట. అక్కడ కాసేపు బయటి నుండే చూస్తూ ఉన్నాం. లోపలికి వెళ్లాలి అంటే స్పెషల్ టికెట్ తీసుకోవాలి. దానికోసం క్యూ కూడా ఉంది, అయినా అన్నిటి కన్నా ముఖ్యం మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు.
మాల్ కి ఇంకో వైపు నుండి బయటికి రాగానే, మధ్యలో కొన్ని నీళ్ళు,అవతల వైపు burj khalifa కనిపించాయి.
అప్పటికి సాయంత్రం కావొస్తుంది, కాసేపు ఐతే  వెలుతురు ఉండదని టక టక కొన్ని ఫోటోస్ తీసుకున్నాం.
ఆ నీళ్ళ చుట్టూ ఉన్న గట్టు పైన మొత్తం చాలా మంది జనాలు ఉన్నారు.

సాయంత్రం 6 నుండి ప్రతి అరగంటకి వాటర్ ఫౌంటెన్ ఇంకా music play చేస్తారట. ఆరు అయ్యేసరికల్లా ఆ నీళ్ల చుట్టు gap లేకుండా వచ్చి నిలబడ్డారు అందరు. అప్పుడే వాతావరణం చల్లగా అవుతూ, మంచి మ్యూజిక్ తో, కలర్‌ఫుల్ వాటర్ ఫౌంటెన్.. మధ్య మధ్యలో ఎదురుగా కొండంత ఎత్తుగా నిలబడి ఉన్న khalifa  అంచులలో మ్యూజిక్ కి అణుగుణంగా లైట్స్ వచ్చి పోతూ..ఒక 5 నిమిషాలు ఎంతో బావుంది.
మ్యూజిక్ మొదలవగానే "స్టాచ్యూ" అన్నట్టు ఎక్కడివాళ్ళక్కడే ఆగిపోయినవాళ్ళు కాస్తా అది ఆగిపోగానే తిరగడం మొదలుపెట్టారు. మేము ఇంకాసేపు అక్కడే ఉండి, మళ్ళీ ఎలాగూ రేపంతా తిరగాలి కాబట్టి మెల్లగా హోటల్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని బయల్దేరాం.
వచ్చేఅప్పుడు రిటర్న్ ట్రిప్ కి కూడా ట్రైన్ టికెట్ తీసుకున్నాం, ఎలాగూ ఇంకా రాత్రవలేదు కదా అని ట్రైన్ లోనే వెల్దాం అని బయల్దేరాం. ఈసారి    ఎంత దూరం నడవాలో ముందే తెల్సు కాబట్టి మెల్లగా నడుచూంటూ వెళ్ళాం. డిన్నర్ చేద్దామంటే ఇంకా టైం అవలేదు, ఆకలి కూడా లేదు. కాని మళ్ళీ హోటల్ కి వెళ్తే రెస్టారెంట్స్ ఎంతదూరం ఉన్నాయో, అని డిన్నర్ కోసం అక్కడే ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళాం. అంతదూరం నడిచి ట్రైన్ ఎక్కి, దిగి హోటల్ కి వచ్చి, ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసేసి హాయిగా బజ్జున్నాం. మరి రేపు సిటీ టూర్‌కెళ్ళాలీ..ఖలిఫా పైనకెక్కాలీ..అన్ని చోట్లా ఫోటోస్ దిగాలి, మరి ఫోటోస్‌లో బాగా రావాలి అంటే మంచిగా పడుకోవాలి కదా..