Thursday, May 8, 2014

దుబాయ్ ట్రిప్ - Day 3

ఈరోజు desert safari కి బుక్ చేసాం. ఎవరైనా ఏజెంట్ నుడి బుక్ చేసుకోవచ్చు లేదా ఆ హోటల్ లో టూరిస్ట్ సెంటర్ నుండి అయినా బుక్ చేసుకోవచ్చు. కాని మనం ఎవరి దగ్గర నుండి చేసినా సరే అన్ని టూర్స్  ఒకే సమయం లో మధ్యాహ్నం 3 గంటలకి మొదలవుతాయి. మూడింటికి మనం బుక్ చేసిన ట్రావెల్స్ నుండి కారు పంపిస్తారు, తిరిగి వాళ్లే రాత్రి 9:30 కి డ్రాప్ చేస్తారట. ఈ రోజూ ప్రొద్దున ఏమి ప్లాన్స్ లేవు కాబట్టి మెల్లగా లేచి అయ్యి కిందికొచ్చాం. నిన్న visitor center లో ఇంకా దగ్గర్లో చూడదగిన ప్రదేశాలు ఏమున్నయో కొన్ని చెప్పారు. వాటి గురించి వివరాలు కనుక్కోవడానికి మా దగ్గర ఇంటర్‌నెట్ లేదుగా.  అందుకే మళ్ళీ అక్కడికే వెళ్లి వాటి గురించి కనుక్కున్నాం. అక్కడికి కొంచెం దూరం లో miracle garden అని ఒక ప్లేస్ ఉందనీ,మొత్తం పూలతో చేసిన గార్డెన్ అని కొన్ని ఫోటోస్ చూపించింది.అక్కడి నుండి ఇంకాస్త దూరం వెళ్తే global village, అన్ని దేశాల సంసృతులు ప్రతిబంబించేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఉంటుందట. కాని అది రాత్రి సమయాల్లో వెళ్తే బావుంటుందని చెప్పింది. దాని ఫొటోస్ కూడా చూపించింది, అంత బాగా ఏమి అనిపించలేదు అవి. అందుకని మిరకిల్ గార్డెన్ వెళ్దాం అనుకున్నాం. బయటికి వెళ్లి టాక్సి తీసుకుంటే 20 నిమిషాల్లో అక్కడికి తీసుకెళ్ళాడు. ఇక్కడ ట్యాక్సిల్లో తిరగడం USలో అంత కాస్ట్లీ అనిపించలేదు. అది ఒక పెద్ద పార్క్‌లాగా ఉంది.
లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకొని వెళ్ళాం. చాలామంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ.లోపలికి వెళ్లాక ఎటు చూసినా పువ్వులే. లోపలికి అడుగు పెట్టగానే పెద్ద నెమలి పూలు ఇలా welcome చెప్పాయి.(అంటే అవేవో కొత్తరకం పూలు కాదు నెమలి ఆకారంలో పెట్టినవి)



రంగు రంగుల పూలు, రకరకాల ఆకారాల్లో అలంకరించిన పూలు. అన్నీ పూలే, పూలు,ఆకులు తప్ప కొమ్మలు ఏమి లేవు.  చాలా పెద్దగా ఉంది ఆ గార్డెన్. లోపలికి వెళ్ళి చూడగానే అరె బావుంది బావుంది అనుకొని, చూస్తూ నడుస్తూ పోయాం.


పాత కార్లు, టైర్లు, గొడుగులు చివరికి మనం షాప్స్ లో వాడే షాపింగ్ కార్ట్ లాంటి వాటిలో కూడా పూలు నింపేసారు.పూలతో చిన్న ఖలీఫా కూడా కట్టేసారు.

ఎంత నడిచినా ఒక ఇంకా వస్తునే ఉంది, కాని ఒక చివరికి రావట్లేదు. పైన మండే ఎండ,నడిచి నడిచి అబ్బా.. అన్నీ పూలే కదా ఏముంటుంది ఇంకా కొత్తగా అనిపించింది. ఈలోపు  అక్కడ క్యాంటీన్ లాగ చిన్న ఫుడ్ కోర్ట్ కనిపిస్తే కూర్చుని ఒక ఐస్‌క్రీం తిని, తిరిగి వచ్చిన దార్లోనే వెనక్కి వచ్చేసాం. అక్కడ కొన్ని చిన్న చిన్న రైడ్స్ అవీ ఉన్నాయి.
ఇంటికి వచ్చాక దీని గురించి గూగుల్ చేస్తే తెలిసింది, అది ప్రపంచం లోనే అతి పెద్ద ఫ్లవర్ గార్డెన్ అంట. పోయిన సంవత్సరం వాలెంటైన్స్ డే కి ఓపెన్ చేసారట దీన్ని.
అక్కడి నుండి హోటల్ కి వెళ్ళి, లంచ్ చేసి మూడింటి కల్లా లాబీలోకి వచ్చి సఫారి కోసం మమ్మల్ని తీసుకెళ్లే వాహనం కోసం వెయిట్ చేసాం. సరిగ్గా  మూడు గంటలకు ఒకతను వచ్చి మమ్మల్ని తీస్కెళ్లాడు.
మనం టూర్ బుక్ చేసుకున్న కంపనీ వాళ్ళు, కొందరు కొందర్ని ఒక గ్రూప్ లాగా ఒక వాహనం లో తీసుకెళ్తారు.ఒక్కొక్కరికి250AED  మనం వారికి ముందే పే చెయ్యాలి.
అతను తీసుకొచ్చిన వెహికిల్ ఒక 7 సీటర్ SUV. అప్పటికే డ్రైవర్ కాకుండా ముగ్గురు ఉన్నారు అందులో. వెనకాల సీట్లో ఒక జంట, ఫ్రాన్స్ నుండి వచ్చారట వాళ్ళు. ముందు డ్రైవర్ పక్కన ఒకతను. పాకిస్తానీ, కెనడా సెటిల్ అయ్యాడట.మేము మధ్య సీట్లో కూర్చుని ఒకర్నొకరం పరిచయం చేసుకున్నాం. అక్కడి నుండి సిటీ దాటి దాదాపు 45 - 50 నిమిషాలు ప్రయాణం చేసి కొంచెం చిన్న ఊరు లాంటి ప్రదేశానికి చేరుకున్నాం.
దగ్గర్లో చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్‌తో చిన్న ప్యాలస్ లాంటీ బిల్డింగ్ ఉంది. అది దుబాయ్ షేక్‌ది, ఎప్పుడూ ఉండడానికి కాదు కాని అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటాడని చెప్పాడు డ్రైవర్. ఒక చోట కార్  ఆపి అందర్నీ దిగమన్నాడు. కిందికి దిగాక చూస్తే అతను ఆపింది చిన్న మెకానిక్ షాప్ దాని లాంటి ముందు.అందరు దిగగానే ఒక మెకానిక్ కార్ దగ్గరికి వచ్చాడు.అయ్యో ఇదేంటి కార్‌కేమన్నా అయ్యిందా, మళ్ళీ ఈ రిపేర్ అదీ ఎంత టైం పడుతుందో అనుకున్నాను.ఈలోపు డ్రైవర్ చెప్పాడు, ఎడారి లోకి వెల్తున్నాం కదా ఇప్పుడు అందుకని టైర్స్‌లో గాలి  తగ్గిస్తున్నారట. అప్పుడు తక్కువ ప్రెషర్ ఉండి, ఆ ఇసుకలో డ్రైవ్ చెయ్యడానికి వీలుగా ఉంటుందట.లేకపొతే పడిపోయే ప్రమాదం ఉంటుందట. అక్కడికి కొంచెం దూరం లోనే  ఎడారి మొదలవుతుంది కాబట్టి ఇక్కడే గాలి తగ్గించేస్తున్నామని చెప్పాడు. అక్కడ చాలా వాహనాలు ఆగి ఉన్నాయి, అన్నిట్లోనూ అలాగే చేస్తున్నారు. అక్కడ మన దగ్గర జాతర్లో ఉన్నట్టు కొన్ని చిన్న చిన్న  షాపులు ఉన్నాయి, ఏదైనా కొనాలనుకుంటే వెళ్ళొచ్చు, కొంచెం సేపు ఆగుతాం అని చెప్పాడు.వాటిలోకి వెళ్లి మళ్లీ ఒక fridge magnet కొన్నాం.
అక్కడి నుండి బయల్దేరిన పది నిమిషాలకు మెల్లగా ఎడారి లాగా ఉన్న ప్రదేశం లోకి ప్రవేశించాం.   అక్కడికి రాగానే డ్రైవర్ మా అందరికి మనిషికొక పాలిథిన్ కవర్ ఇచ్చి,ఇప్పుడు ఇసుక తిన్నెల్లో అటూ ఇటూ తిప్పుతాను, ఎవరికైనా వాంతికొస్తే అందులొనే చెయ్యాలి, ఒకవేళ కార్లో చేస్తే 500AED ఫైన్ వేస్తారు కంపనీ వాళ్లు అని చెప్పాడు.ఇంక కార్లో పై భాగంలో , పక్కన పట్టుకోవడానికి గ్రిప్ ఉండేలా కొన్ని rods లాంటివి ఉన్నాయి, వాటిని పట్టుకొండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పాడు. తర్వాత..

4 comments: