Thursday, September 26, 2013

నేను - నా సినిమా కష్టాలు

సినిమా కష్టాలు అంటే నాకు సినిమాలో లాంటి కష్టాలు ఉన్నాయని కాదు, సినిమా వల్ల కష్టాలు లేదా సినిమా కోసం కష్టాలు.
సంతోషం ప్లస్ బాధ
ఆహ్లాదం ప్లన్ చిరాకు
రెండు కలిపి ఎప్పుడన్నా వస్తాయా..
వస్తాయి ఎప్పుడైనా tasty food తింటున్నప్పుడు పక్కనుండి nasty smell  వస్తేనో..
మనం చేసిన వంట బావుందని మనకే మిగల్చకుండా వేరేవాళ్ళు తినేస్తేనో..
కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఎవరూ చూడకపోతేనో..(కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజు నాకు ఎలా ఉన్నా హాపీగా ఉన్నట్టనిపిస్తుంది మరి)
ఇలాంటప్పుడు ఈ ఇద్దరు ఫీలింగ్స్ కలిసి వస్తారు కదా...

Google Image


ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వస్తారట. ఎందుకో తెల్సా..
ఎందుకంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసా.ఇంక దేనికి అత్తారింటికి దారేదికే.  అంత వరకు బానే ఉంది. ఇది హ్యపీ పార్ట్(hopefully). నాకు సమంత ok, పవన్ కళ్యాణ్ ఇంకా ok, త్రివిక్రం ఇంకా ఎక్కువ ok. సో హ్యపీగానే ఉంటుందనుకుంటున్నా..
ఇంక sad పార్ట్‌కొస్తే ఫస్ట్, theater లో స్క్రీన్ గురించి చెప్పాలి, తర్వాత అందులో సీట్స్ గురించి చెప్పాలి.
నాకేమో ఎంచక్కా పెద్ద స్క్రీన్‌లో సినిమా చూస్తే సంతోషంగా, కంటికి హాయిగా, కడుపు  నిండిపోయినట్టుగా అనిపిస్తుంది.
ఇప్పుడు మేము వెళ్ళే theater లో స్క్రీన్ ఎంత ఉంటుందంటే ఇంట్లో ఉండే home theater కి 4 ఇంచులు అటూ ఇటూ ఉంటుందంతే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లోపలికి అడుగు పెట్టగానే షాక్ అయ్యా ఒక రెండు నిమిషాలు. అప్పటివరకు అలాంటి డొక్కు, పిచ్చి, గలీజ్ theater ఎప్పుడు చూడలేదు. ఇండియాలో చిన్న టౌన్‌లో నేను చూసిన theaters కూడా ఇంతకన్నా బానే ఉంటాయి.ఇందులో అసలు నాకు theaterలో సినిమా చూసిన ఫీలింగే రాదు. ఏదో DVD ప్రింట్ పెద్ద T.Vలో పెట్టుకొని చూసినట్టనిపిస్తది.
మామూలుగా అయితే నాకు స్క్రీన్ open చెయ్యకముందు వెళ్ళి, adsతో సహా చూస్తేనే తృప్తిగా అనిపిస్తుంది. ఒకవేళ రీల్ పడ్డాకో, టైటిల్స్ పడుతున్నప్పుడో వెళితే ఏదో మిస్ అయిపోయినట్టనిపిస్తుంది. ఇంక సినిమా మొదలయ్యాక వెళ్తే అంతే సంగతి, మళ్ళీ ఆ మిస్ అయిన సీన్స్ చూసేవరకు( అందులో ఏమి స్టోరీ జరగకపోయినా).  అలాంటి  ఫీలింగ్ ఏది రాదు ఈ theater లో.
సరే పోని చిన్న స్క్రీన్ అయినా హాయిగా కూర్చొని చూద్దాం అంటే అదీ లేదు. కాస్త త్వరగా వెళ్ళి వెనక సీట్స్‌లో కూర్చుంటేనే సరి, లేకపోతే కొంగలా మెడ పైకెత్తి చూడాలి. సినిమా అయ్యేలొపు మెడ పట్టెయ్యడం ఖాయం. పైగా అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
పోయినసారి ఒక సినిమాకెళ్ళినప్పుడు కాస్త లేట్ అయ్యింది. వెళ్ళే అప్పటికి టైటిల్స్ పడుతున్నాయి. అందరు కూర్చున్నారు. theater  మధ్యలో వరకు నిండిపోయింది. మధ్యలో ఒక 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. వెళ్ళింది ముగ్గురం కాబట్టి అక్కడ సరిపోతాయ్  అని వెళ్ళి కూర్చున్నాం.
కూర్చుంటూ అనుకున్నాం, మధ్యలో ఏ వరస ఒక్కటి మనకొసమే అన్నట్టు వదిలేసారు, లేకపొతే ఇంకా ముందుకెళ్ళి కష్టపడాల్సొచ్చేది అని నవ్వుకుంటూ కూర్చున్నాం. వాళ్ళిద్దరు బానే కూర్చున్నారు. నేను కూర్చున్న సీట్ ఒక సైడ్ కాస్త విరిగిపోయి వంగిపోయి ఉంది.
ఈ సీట్ కొంచెం విరిగిపోయింది, అటు పక్క దాంట్లోకి వెళ్ళి కూర్చుంటా అని పక్కనున్న దానితో చెప్పి, ఆ సీట్‌లోంచి లేచి పక్కకెళ్ళి కూర్చున్నా. అన్యాయంగా ఆ సీట్ ఇంకా ఎక్కువ విరిగి ఉంది, అసలు కూర్చోడానికే రాట్లేదు. మళ్ళీ లేచి పాత సీట్లొకే వచ్చా. అసలే నాకు సినిమా మొదలయ్యాక మధ్యలో లేచి అటు ఇటూ తిరిగితే మొహమాటం, వెనక వాళ్ళు తిట్టుకుంటారేమో అని.
 సరే అని పాత సీట్లో ఒక వైపు వంగి కూర్చొని, మా వాళ్ళకి చెప్పా ఇక్కడ కష్టంగా ఉంది, ముందుకెల్దామా అని. అప్పుడే అసలు కథ మొదలవుతుందేమో మా వాళ్ళు కళ్ళప్పగించి చూస్తున్నారు, నా మాటకు సరిగ్గా రిప్లై కూడా ఇవ్వకుండా. పోని ఒక్కదాన్ని వెళ్దామా అంటే పక్కన వాళ్ళతో డిస్కస్ చెయ్యకుండా ఉండలేను సినిమా మధ్య మధ్యలో.
పైగా మెడ నొప్పి ఉంటది అక్కడ. సో మెడ నొప్పి, నడుము నొప్పిలో రెండో దానికే ఓటేసి ఇక్కడే కూర్చుని సినిమా చూసా.
హ్మ్మ్.. ఆ theaterకే ఇంకాసేపట్లో వెళ్ళబోయేది.
మరి అంత ఇష్టం లేకుండా దానికే ఎందుకు వెళ్ళాలి అంటే ఇంకా ఎక్కడ తెలుగు సినిమాలు రావు కాబట్టి. ఇదేమైనా దగ్గరా అంటే అదీ కాదు, ఈ మాత్రం మహాభాగ్యానికి గంట డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలి. మేమే గంట డ్రైవ్ వేస్ట్ అనుకుంటే, ఇక్కడికి 2,3 గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
సో.. నాకు ఈ రోజు కొంచెం వెనకాల సీట్, విరిగిపోయింది కాకుండా రావాలని ఆశిస్తూ.. 

12 comments:

  1. చోచ్చోచ్చో... అరెరెరె, ఎన్ని కష్టాలో పాపం :)
    గుడ్ లక్ అనామికా గారు :)

    (అనామకుడే)

    ReplyDelete
  2. vammoo..entandi babu meeru alaska lo kaani untaru aa enti

    ReplyDelete
    Replies
    1. Alaska కాదు, New Mexico కాదు. but still ఇలా ఉంది ఇక్కడ

      Delete
  3. US lo kuda antha worst theaters vuntaya?

    ReplyDelete
    Replies
    1. అవును satish గారు. మేము ఉండే ప్లేస్‌లో అలానే ఉంది. మిగతా theaters బానే ఉంటయి కాని, తెలుగు సినిమా వేసే theater ఒక్కటే బావుండదు.

      Delete
  4. Inthaki vellaka emaindho ani waiting... :)
    Happy or sad or mixed ??

    ReplyDelete
    Replies
    1. హహ హ్యపీనే...చాలా త్వరగా వెళ్ళాం కాబట్టి కావాల్సిన చోటే కూర్చున్నాం.సినిమ కుడ హ్యాపీసే...

      Delete
  5. Tamaru aa vuru peru mariyu theater peru iste chadive vaariki artham avutundi kada!

    ReplyDelete
  6. ఏ ప్లేస్ అయినా ఆ సిటీ లో ఇది తప్ప ఇంకో థియేటర్ లేదులెండి.. తప్పించుకోవడానికి
    thanks for your comment

    ReplyDelete
  7. US lo theatres anta adwannam ga untaaya 1st time vintunna

    ReplyDelete
    Replies
    1. కొన్ని ప్లేసెస్ లో అలా ఉంటాయేమో అంతే. actual ga థియేటర్స్ బావుంటాయి, కాని తెలుగు సినిమాలు ఎక్కువ వరకి మనవాళ్ళే తీసుకుంటారు కదా, రెంట్ తక్కువ అని ఇలాంటి వాటిల్లో వేస్తారనుకుంటా.

      Delete