Wednesday, June 11, 2014

అబ్బాయి పెళ్ళి - అమ్మాయి చదువు

అతనికి జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయాయి.అమ్మాయి చదువు పూర్తి చేసుకొని మంచి కంపనీలో ఉద్యోగం చేస్తుంది.అబ్బాయి పెళ్ళి చేసుకొని భార్యా పిల్లలతో హాయిగా ఉన్నాడు.
******
తన ఉద్యోగం పోయింది, వేరే ఆదాయం ఏమి లేదు.ఇప్పుడేం చెయ్యాలో పాలు పోవట్లేదు.ఇంట్లో కాలేజీకెళ్తున్న కూతురు, పెళ్ళి కావల్సిన ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూతురు చదువు ఎలా పూర్తవ్వాలి, అబ్బాయిలిద్దరికి పెళ్ళిళ్లు ఎలా చెయాలి!!
*****
ఆ భార్యా భర్తలు చాలా పధ్ధతిగా జీవితం గడుపుతారు. అందుకనే కూతురి పెద్ద చదువులకి, కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యడానికి సరిపడినంత డబ్బు కూడబెట్టగలిగారు.  
*******
ఈరోజే మా బ్యాంకు వారు ప్రవేశ పెట్టిన పథకంలో చేరండి.మీ కూతురి చదువుకి, కొడుకు పెళ్ళికి ఏ ఆటంకం రాకుండా కావల్సినంత డబ్బు ఆదా చెయ్యండి.
*********  
టైటిల్ తో సహా ఈ వ్యాక్యాలన్ని ఏదో తేడా గా అనిపిస్తున్నాయా(అనిపించకపోతే చాలా సంతోషం). మనం రోజూ చదివే కథల్లో, చూసే సినిమాల్లో, టివిలో ఇవే మాటల్ని వింటున్నాంగా రోజూ, కాకపోతే అబ్బాయి స్థానంలో అమ్మాయి,  అమ్మాయి స్థానంలో అబ్బాయి .అవేవో పాతకాలం కథలు/సినిమాలు, పాత ప్రకటనలు కాదు. పోనీ బయట కూడా సమాజం అలానే ఉంది అందుకే అలాంటివే రాస్తున్నారు/తీస్తున్నారు అనుకుందాం అంటే, మిగతా కథ అంతా దీనికి విరుద్దంగానే ఉంటుంది.ఒక పెద్ద అతను పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, ఒంటరిగా ఉండలేక తోడు కోసం ఇంకో పెద్దావిడని పెళ్ళి చేసుకుంటాడు. ఈ విషయంలో అంత విశాలంగా ఆలోచించి, అబ్బాయి, అమ్మాయి విషయంలో మళ్ళీ same dilouge.
ఒకవేళ అబ్బాయి పెళ్ళి గురించి ఏవన్నా కథలు/సినిమాలో సీన్స్ ఉన్నా కేవలం కామెడి కోసమే అయ్యుంటాయి.
మొన్న ఏదో సినిమాలో చూస్తే, ఇది బాబు కాన్వెంట్ ఫీజుకి, ఇది పాప ఫిక్స్‌డ్ డిపాజిట్ కి అట.
తల్లి తండ్రులు అమ్మాయి పెళ్ళి విషయంలో అబ్బాయి కన్నా ఎక్కువ ఆలోచిస్తారు అన్నది నిజమే కావచ్చు, కాని అమ్మాయి చదువు, ఉద్యోగం విషయాల్లో కూడా అంతే ఆలోచిస్తున్నారేమో atleast ఈ మద్య కాలంలో.
నాకు తెల్సిన చాలా మంది(కూతుర్ని మంచిగా చదివించిన వాళ్ళు), కూతురి చదువైపోగానే కొడుకు ఉద్యోగం కోసం ఎంత ఆరాటపడ్డారో కూతురికి జాబ్ రావాలని అంతే అనుకున్నారు. ఇంకొకరు కూతురు పెళ్ళై  అత్తారింటికి వెళ్ళిపోయినా తను చదివిన చదువుకు న్యాయం చేసేలా జాబ్ రావాలని కోరుకున్నారు, కోరుకోవడం కాదు పెళ్లైంది కదా అని relax అవకుండా, ఇంక జాబ్ రాలేదని బాధ పడుతుండేవాళ్ళు.(తర్వాత తను మంచి జాబ్ లో చేరింది)    అమంచి ఉద్యోగం ఉన్నా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్న అబ్బాయిలూ, బాధపడుతున్న తల్లితండ్రులూ ఉన్నారు.
Google Image

ఏదేమైనా చదువైనా, పెళ్ళైనా అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికీ ముఖ్యమైనవే. కనీసం మీడియాలో అయినా అలా చూపించకపోతే బావుండు.  

Wednesday, June 4, 2014

నననాననా...నననాననా...

నననాననా...నననాననా...♪♪♪♪నననానన్నాననా..♪♪♪♪
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..
నడిపించిన మా నాన్నకే నానయ్యానుగా..♪♪♪♪
కొన్ని రోజుల నుండి ఇదే పాట పాడుకుంటున్నాను. కొన్ని రోజులు అంటే మనం సినిమా చూసినప్పటినుండి.
సినిమా చూడకముందు పెద్దగా ఎక్కలేదు పాటలు, లేకపోతే నేను సరిగ్గా విని ఉండలేదేమో.సినిమా చూసొచ్చాక చాల సార్లు విన్నాను.అది కూడా ఆ చిన్నపిల్లాడి గొంతులో పాడిందే. ఆడియో లో 2 సార్లు ఉంది కాని చిన్న పిల్లాడు పాడిందే చాలా నచ్చింది నాకు.

సినిమా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు ఒక్క నాగ చైతన్యను అరెస్ట్ చేసే సీన్ లాంటివి కొన్ని తప్ప. ముందే కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోలేదు కాబట్టి చూస్తున్నప్పుడు బావుంది.సినిమా చూడకుండా కథ వింటే అదేంటి అర్థం పర్థం లేని కథ అనిపించేది. హాయిగా అస్సలు ఒక్క ఫైట్ కూడా లేదు, అన్ని పాటల్లోను సీన్స్ ఉన్నాయి ఒట్టి హీరో హీరోయిన్స్ డాన్స్  కాకుండా. నాకు అలా కేవలం డాన్స్  ఉన్న పాటలైతే బోర్ అనిపిస్తుంది. సమంత వాళ్లకి గత జన్మ గుర్తుకువచ్చినట్టు చూపించక్కర్లేదు అనిపించింది. infact అలా చూపించకపోతేనే బావుండేదేమో.మొత్తానికి మొదట్లో రిలీజ్ చేసిన పోస్టర్ కి సరిపోయే కథ.