Friday, May 30, 2014

దుబాయ్ ట్రిప్ - Day 4

ఈరోజు ట్రిప్‌లో చివరి రోజు. ఏమి ప్లాన్స్ పెట్టుకోలేదు, ఇంకా చూడ్డానికి ఇంట్రెస్టింగ్ ఫ్లేసెస్ కూడా ఏమి అనిపించలేదు. అందుకని ఊరికే సిటీలో తిరిగేసి, వచ్చి కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ 14 గంటలు ఫ్లైట్‌లో ప్రయాణం చెయ్యాలి కదా.
కిందికి వెళ్లి దుబాయ్ మాల్ లాంటి పెద్ద మాల్ కాకుండా మామూలు షాప్స్ ఎక్కడుంటాయో కనుక్కుని బయల్దేరాం. ఎలాగూ టైంపాస్ కే కదా తిరిగేది అని మెట్రోలోనే వెళ్లాం. అక్కడ కొన్ని souvenirs, చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకున్నాం.నిన్న మాతో పాటు desert safariకి వచ్చిన ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడెక్కడికివ్ వెళ్లారో చెప్తూ Dubai creekకి వెళ్లాము, చాలా బావుంది visit చెయ్యాల్సిన ప్లేస్, మీకు టైం ఉంటే వెళ్లండి అని చెప్పారు. బయల్దేరేముందు కనుక్కుంటే ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ కి దగ్గర్లొనే ఉంది.  టైం ఉంది కదా అక్కడికి వెల్దాం అనుకున్నాం. అక్కడి నుండి ఒక ట్రైన్లో వెళ్లి , ఇంకో బస్ తీసుకుంటే చేరుకోవచ్చు. ట్రైన్ దిగి బస్ ఎక్కడ    ఆగుతుందో కనుక్కొని బస్టాప్ కి వెళ్లాం. ఒక 10 నిమిషాల తర్వాత  బస్ వచ్చింది, తీరా ఎక్కిన తర్వాత బస్ లో మెట్రో కార్డ్ స్వైపింగ్ మిషన్ మాత్రమే ఉంది. అది కూడా మా దగ్గర ఉన్న ట్రైన్ కార్డ్ పని చెయ్యదంట. బస్‌లో ఎక్కాలంటే వేరేది తీసుకోవాలి, క్యాష్ కూడా తీసుకోరు.
ఇంక బస్ దిగేసి మళ్ళీ స్టేషన్ లోపలికి అంత దూరం  aఏం వెళ్తాం లే అని టాక్సి ఆపేసి ఎక్కాం.ఎక్కడికెళ్లాలో చెప్తే  ఆ డ్రైవర్ అది పక్కనే నడుస్తూ వెళ్ళొచ్చు అని చెప్పి, ఇలా ముందుకు తీస్కెళ్ళి 2 నిమిషాల్లో ఆపేసాడు. అసలు ఆ ప్లేస్ ఏంటో కూడా తెలియదు(బ్రౌజ్ చెయ్యడానికి నెట్ కూడా లేదు కదా!) బయట చూస్తే చాలా మంది ఉన్నారు.  టికెట్ తీసుకొని లోపలికెళ్లాం. తీరా చూస్తే అదేంటో కాదు.. చిల్డ్రన్స్ పార్క్!!అన్ని చిన్న పిల్లల activities ఉన్నాయి. ఎలాగూ వచ్చేసాం  కదా అని అటు ఇటూ తిరిగి కాసేపు కూర్చుని బయటికొచ్చేసాం. రూం కొచ్చేసి నిన్న, మొన్న బయటికి లాగి పడేసిన లగ్గేజ్  అంతా సర్దుకొని, చెక్ అవుట్ చేసి బయటపడ్డాం.
వచ్చిన రోజు మా మామయ్య వాళ్లకి, తర్వాత డ్రైవర్‌కి ఒక 2,3 సార్లు కాల్ చేసాం కదా, దానికి 120 dirhams చార్జ్ చేసారు. మా దగ్గర unlocked ఫోన్ లేదు, ఫోన్ ఉంటే అక్కడి sim card కొనుక్కొని వేసుకోవచ్చు. మనల్ని ఎవరైనా కాంటాక్ట్ చెయ్యడానికి ఉంటుంది. పెద్ద ఖర్చేం కాదు, హొటల్ నుండి చేసుకున్న దాని కన్నా చాల తక్కువ.  
అలాగే మా దగ్గర అక్కడి స్విచ్ బోర్డ్‌లో సరిపొయే ప్లగ్ లేదు,ఇండియాది కాని, US ది కాని సరిపోదు అక్కడ. ఫస్ట్ డే కెమెరాలో mamory card ఫుల్ అయిపోతే laptopలో కాపీ చెయ్యడానికి laptop చార్జర్ పెట్టలేకపోయాం, అందుకని ఇంకో కార్డ్ కొన్నాం బయటికి వెళ్ళినప్పుడు. తర్వాత రోజు కెమెరా చార్జింగ్ అయిపోయింది.front deskలో అడిగితే కన్వర్టర్ పంపించారు.
ఫ్లైట్ టైం కన్నా చాలా ముందుగానే చేరుకున్నాం. అప్పటికి మా ఫ్లైట్ చెక్-ఇన్ కూడా మొదలుపెట్టలేదు. కాసేపయ్యాక చెక్-ఇన్ చేసి లోపలికెళ్లి Duty free షాప్స్‌లో తిరిగాం. ఒక గంటాగి చూస్తే ఫ్లైట్ 1 గంట డిలే అని చూపించింది. ఆ గంట కాస్త అలా అలా లేటయ్యి 5 గంటలు అక్కడే వెయిట్ చెయ్యాల్సొచ్చింది.అసలే నిద్రపోయే టైం, దానికి తోడు చాలా అలసిపోయి ఉండటంతో అంతసేపు అలా కూర్చోవడం మా వల్ల కాలేదు.  నేనైతే అలానే కూర్చుని చాలా సేపు నిద్రపొయా. చివరికి ఫ్లైట్ ఎక్కాక మధ్యలొ తినడానికి తప్ప దిగేవరకు నిద్రపోయా.
here comes New York and end of my trip ఆదివారం మధ్యాహ్నం అయింది వచ్చేసరికి, మళ్ళీ రేపటి నుండి ఆఫీస్‌కెళ్ళాలి. కాకపొతే ఇన్ని రోజులు ఈ దేశం లో ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఇప్పటి నుండి ఇక్కడ నాకోసం ఒకరుంటారు, నేను కూడా part of one family with 2 members. మరి పెళ్ళి చేసుకోవడానికే కదా ఈ ఇండియా ట్రిప్ :):)

4 comments:

  1. Congrats and welcome to the world of married life

    ReplyDelete
    Replies
    1. Thannk you.. Anonymous కాకుండా మీ పేరు mention చేయొచ్చుకదండి.

      Delete
  2. Intakee memu memu antu cheputunnare kaani..mee to evaru undedi introduce cheyyakkara leda? travelog inkasta beeter ga feel avutu rayavachu anukotunnanu..
    Not discouraging you but just my feeling after reading all your posts.. you want to tell something but at the same time missing some other things..

    ReplyDelete
    Replies
    1. చివర్లో రాసాను కదా ఎవరితో వెళ్లానో..such comments never discouraging.Thanks for your comment..

      Delete