Monday, May 5, 2014

దుబాయ్ ట్రిప్ - Day 2

దుబాయ్‌లో నాకు వరసకి మామయ్య ఒకరు ఉన్నారు. మా బాబాయి కి చాలా క్లోజ్ అతను.
మేము ఇలా దుబాయ్ ట్రిప్ అనుకుంటున్నాము అని ఇంట్లో చెప్పగానే మా బాబాయి వెళ్ళినప్పుడు తనని కలవమని, అక్కడ ఏమైనా కావాలంటే తను హెల్ప్ చేస్తారని చెప్పి, అక్కడున్నప్పుడే కాల్ చేసి మాట్లాడిపించారు ఒకసారి. నిన్న అక్కడికి చేరగానే ఆయనకి కాల్ చేసాం. రేపు మా ప్లాన్ ఏంటి అంటే ముందె అనుకున్నట్టు సాయంత్రం 5 కి burj khalifa పైకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసాం, ఇంకా ప్రొద్దున అంతా సిటి చుడ్డానికి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పాం. అయితే మామయ్య వాళ్లకి ట్రావెల్స్ ఉందనీ, రేపు సిటి టూర్ కోసం టికెట్స్ ఏమీ తీసుకోవద్దనీ, ఉదయం 9 కల్లా వాళ్ళ ట్రావెల్స్ నుండి కారూ, డ్రైవర్ నీ పంపిస్తానని చెప్పారు.
ఆ రోజు ప్రొద్దున్నే లేచి తయారయ్యి, ఇంకా 9 అవడానికి కాస్త టైం ఉందని , అక్కడ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ ఏమీ లేదు కాబట్టి రెస్టారెంట్‌లో కింద బ్రేక్‌ఫాస్ట్  ఏముందో చూద్దాం అని వెళ్ళాం.  రూం లోనే మెను చూసాం, చాలా వెరైటీస్ ఉన్నాయి కాని ప్రైస్ ఎంతో లేదు. ఎలాగూ ఎక్కువే ఉంటుంది కాని చూద్దాం ఒక 100dirhams వరకి ఉంటే ఆలోచిద్దాం అని వెళ్ళాం. రెస్టారెంట్ చాలా పెద్దగానే ఉంది కాని ఒకే ఒక్క టేబుల్ దగ్గర ఇద్దరు తప్ప ఎవరూ లేరు. అక్కడ ఫ్రంట్ డెస్క్ దగ్గర ఉన్న అతను బ్రేక్‌ఫాస్ట్ బఫె అని చెప్పాడు. ఎంత అంటే 170 aed అంట. ఏం పర్లేదు తిందాము అంటున్నా కాని నేనే we will be back అని చెప్పేసి తీసుకొచ్చేసా అక్కడి నుండి. మరి 170 AED అంటే దాదాపు 50$. బ్రేక్‌ఫాస్ట్ కి అంత అవసరం లేదు కదా, ఏదొ లంచ్ అయినా తినేస్తాం కాని అంత ప్రొద్దున ఎక్కువ ఎలాగూ తినలేం (ముందు రోజు సిటి టూర్ కోసం బుక్ చేద్దాం అని చూస్తే per person 220aed అలా ఉన్నాయి టూర్ ప్యాకేజ్. ఒకరోజు సిటి టుర్ కెళ్ళే డబ్బుల్తో ఎందుకులే అని ).
కిందికొచ్చి ఒక 5 - 10 mins  wait చేసాక మమ్మల్ని pick చేసుకోవడానికి ఒకతను వచ్చాడు. కార్‌లో కూర్చున్నాక అతన్ని ప్లాన్ అడిగితే ఎక్కడెక్కడికి తీసుకెల్తాడో చెఫ్ఫాడు. వెళ్తూ వెళ్తూ డ్రైవర్‌తో మాటలు కలిపితే, తనూ తెలుగు అతనే అని, ఇక్కడికి వచ్చి 6, 7 సంవత్సరాలు అవుతుందనీ తన గురించి కొన్ని వివరాలు చెప్పాడు.
అక్కడి నుండి బయల్దేరి, దార్లో బ్రేక్‌ఫాస్ట్ చేసేసి palm jumeirah island కెళ్ళాం. అది palm tree ఆకారం లో నిర్మించిన ఒక artificial island. మధ్యలో రోడ్డు, అటూ ఇటూ ఉన్న ఆకు షేప్స్ పైన పెద్ద పెద్ద బిల్డింగ్స్.
Google Image

షారుఖ్ ఖాన్ కి అక్కడ ఒక ఇల్లుందని ఎప్పుడో చదివిన గుర్తు, అదే విషయం అతన్ని అడిగితే అవునని చెప్పి అటు వైపు వెళ్ళినప్పుడు చూపించాడు. ఈ వరుసలోనే ఆ ఇల్లుంది అని.  మనము main trunk పైన ఉన్న రోడ్ పైనే తిరగగలం.ఒక్కో ఆకు లాంటి షేప్ మొదట్లో సెక్యూరిటి గేట్ ఉంటుంది. పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలరట.
అలా ఆ రోడ్ పైన కొంచెం దూరం వెళ్ళి ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆపాడు. అదే అట్లాంటిస్. ఇది palm మీద నిర్మించిన మొదటి రిసార్ట్ అట. మమ్మల్ని దాని ముందు దింపి, మేము అటు ఇటు కాస్త తిరిగి చూసేలోపు అతను కార్ పార్క్ చేసి వచ్చాడు. అక్కడికి main land నుండి ఒక ట్రైన్ కూడా  ఉంటుందట.   అట్లాంటిస్ లోపలికి వెళ్ళి కాసేపు తిరిగిచూసి బయటికి వచ్చాం. లోపల కొన్ని నీళ్ళళ్ళో చేసే ఆక్టివిటీస్ ఉన్నాయి కాని మేము వాటికేం వెళ్ళలేదు. అక్కడ ఒక్కరు కూడా లోకల్ వాళ్ళు లేరు.  అందరూ టూరిస్టులే..
బయటికి వచ్చి రోడ్ దాటగానే మొత్తం సముద్రం. అక్కడ కాసేపు కూర్చున్నాం అలా నీళ్ళని చూస్తూ.
అక్కడి నుండి చూస్తుంటే దూరంగా పొగ మంచు మధ్యలోంచి అస్పష్టంగా బుర్జ్ అల్-అరబ్ కనిపిస్తుంది. ఇవి రెండే మా ట్రిప్ లో ప్రధానంగా చూద్దాం అనుకున్నవి.  
ఆ వాతావరణం,ఆ ప్లేస్ అంతా బావుంది కాని నాకు ఐలాండ్ మీదకి వచ్చినట్టే అనిపించట్లేదు. ఇప్పుడేదో బీచ్ దగ్గరికి వచ్చినట్టూ, ఇందాక trunk లో మామూలు రోడ్ పైన వచ్చినట్టే అనిపిస్తుంది, నాకు ఆ palm పైన ఉన్నట్టు ఆ ఫీలింగ్ రాలేదు, అదే మాట అంటుంటే డ్రైవర్ చెప్పాడు అయితే మిమ్మల్నొక చోటికి తీసుకెల్తా అని.  అక్కడి నుండి మమ్మల్ని తీసుకొని మేము వచ్చిన దార్లో కాకుండా, ఇంకా ముందుకి తీసుకెళ్ళాడు. అది ఇంక plamకి ఇటు వైపు చివర అట, అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్లలేం, main landకి వెళ్ళాలంటే ఇందాక వచ్చిన ఒకటే దారి. ఇక్కడ ఇంకా కొన్ని కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అక్కడ రోడ్ పైన ఒక పక్కన ఆపి మమ్మల్ని దింపి వెళ్ళిపోయాడు.ఇంకాస్త ముందుకి వెళ్ళి కార్ వెనక్కి తిప్పి తీసుకురావడానికి.
ఇందాకటి కన్నా ఈ చోటు చాలా నచ్చింది నాకు. మధ్యలో రోడ్డు, రోడ్ కి రెండు వైపులా నీళ్ళు. ఒక వైపు అట్లాంటిస్, ఒక వైపు అల్-అరబ్. ఇంకా palm మీద మేము నిల్చున్నది కాకుండా కొంచెం దూరం లో ఉన్న ఆకు షేప్ కూడా తెలుస్తుంది. దాని మీద వరుసగా బొమ్మరిల్లు పేర్చినట్టు బిల్డింగ్స్.ఈలోపు అతను కార్ వెనక్కి తిప్పుకొని ఒక 10-15 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. సాధారణంగా టూరిస్టులని ఇంత ముందుకు ఎవరు తీసుకురారు అట. అక్కడి నుండి ఈ view కూడా అందరికి తెలియదు, తను ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు ఇటు వైపు వచ్చాడట  ఇప్పుడు మాకు చూపిద్దాం అని తీసుకువచ్చాడట.soo nice..  అనుకున్నా.. అసలు అక్కడికి వెళ్ళకపోతే నాకు అసంతృప్తిగా అనిపించేదేమో.  
అక్కడి నుండి అల్-అరబ్ వైపు బయల్దేరాం. దార్లో అడిగాం అతన్ని అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయని. చాలా కఠినంగా ఉంటాయట. ఒకసారి రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే 2000 aed వరకు ఫైన్ ఉండొచ్చట. ఈ లెక్కన చూస్తే US లోనే నయం ఏమో అనిపించింది. లైసెన్స్ రావడం కూడా కష్టం అనీ, చాలా ఖర్చు అవుతుందనీ చెప్పాడు. దార్లో వెళ్తూ దుబాయి షేక్ భవనాన్ని చూపించాడు. అక్కడ వేరే దేశం సిటిజన్స్ ఏవైనా ఆస్తులు కొంటే పూర్తిగా మనవి కావు, 99 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ తో మాత్రమే కొనగలం అట. కాని ఈ మధ్య కాలం లో, కొన్ని ప్లేసెస్‌లో మాత్రం మొత్తంగా మనమే కొనుక్కోవడానికి అనుమతి ఇస్తున్నారట.
దూరం నుండి చూస్తే బుర్జ్ అల్-అరబ్, జుమెరా బీచ్ హోటల్ కలిసిపొయి ఒకే బిల్డింగ్ లాగా అనిపించాయి. దగ్గరికెళ్ళాక కాని నమ్మలేకపోయా అవి 2 వెర్వేరు అని. అక్కడ కాసేపు తిరిగి souvenirs కొన్నాం. ఇవే అవి.నాకు భలే నచ్చేసాయి.
my Image ;)

అప్పటికే లంచ్ టైం అయిపోయింది.అక్కడ కాసేపు తిరిగి కొన్ని ఫోటోస్ తీసుకొని, ఎక్కడికన్నా మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళమన్నాం. అక్కడ చాలా రెస్టారెంట్స్‌లో ఇండియన్, చైనీస్, అరబిక్ ఒకే దాంట్లో ఉన్నాయి, దేనికదే విడిగా లేకుండా. లంచ్ చేసాక రివర్ వాక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. బీచ్లో కాసేపు వాకింగ్ చేసాం. ఇసుకలో చేసిన్ కొన్ని బొమ్మలున్నాయి అక్కడ. చాలా మందే బికినిల్లో కనిపించారు.
ఎక్కువ సేపు నడవలేకపోయాం అక్కడ, చాలా  వేడిగా అనిపించింది. అందుకని కొంచెం సేపు ఉండి ఎలాగూ ఖలీఫా పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకున్న టైం అవుతుందని బయల్దేరాం, మమ్మల్ని దుబాయి మాల్ లో దింపేసి అతను వెళ్ళిపోయాడు. ఖలీఫా పైకి వెళ్లడానికి ఎంట్రన్స్ మాల్ లోనే ఒక వైపు నుండి ఉంది. అక్కడికి వెళ్ళి నెల రోజుల ముందే  బుక్ చేసిన టికెట్స్ ని కలెక్ట్ చేసుకొని పైకి వెళ్లడానికి ఉన్న క్యూలో నిల్చున్నాం. లోపల దానికి సంబంధించిన చాలా వివరాలు ఉంచారు. ప్రపంచంలోనే ఎత్తైన టవర్, మాన్ మేడ్ వండర్ అనీ, ఇంకా మిగతా ఎత్తైన భవనాలేంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి లాంటి వివరాలన్ని ఉన్నాయి. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా 2 times ఎక్కువ ఎత్తు అట.
అవి చదువుతూ ముందుకెళ్లాక సెక్యూరిటి చెక్, అది దాటి ముందుకెల్లాక మళ్ళీ కాసేపు లైన్‌లో నిల్చున్నాం ఎలివేటర్ కోసం. అందులో 200 అంతస్తులకు పైగా ఉన్నాయట కాని మనల్ని 120 వ అంతస్తు వరకే తీసుకెళ్తారని తెలిసింది. అయ్యో పై వరకి తీసుకెళ్లరా అనిపించింది.
ఎలివేటర్ లో ఒక నిమిషంలో 120 వ అంతస్తుకి చేరుకున్నాం. కాని పైకెళ్లాక నాకు కొత్తగా ఏమి అనిపించలేదు. sears tower, rockefeller center top వెళ్లాం కాబట్టి పైకెల్లాక అంత ఎగ్జైట్‌మెంట్ అనిపించలేదు .   sears tower లో పైకెళ్ళాక మనం ఒక గ్లాస్ అద్దం మీద నిలబడొచ్చు. కింద ఏమి ఉండదు. ఆ ఫీలింగ్ మాత్రం unique. ok ok ఆ విషయం వదిలేస్తే, నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నాం అన్నా కదా ఎందుకంటే అక్కడి నుండి sun set బావుంటుందని చదివా, ఆ సమయాల్లో లిమిటెడ్ టికెట్స్ ముందే అమ్ముడయిపోతాయి. సాయంత్రం 4,5 టైం లో వెళ్తే day view, night view రెండూ చూడొచ్చు, ఇంకా సుర్యాస్తమయం కూడా చూడొచ్చు అని. ఏరోజూకైనా టికెట్స్ సరిగ్గా 30 రోజుల ముందు తెరుస్తారు .  ఆన్‌లైన్లో తీసుకుంటే టికెట్ ఒక్కటి 125aed, అదే మనం అక్కడికి వెళ్ళి అప్పుడే కొనుక్కుంటే 400 aed. అందుకని ముందే ఆన్‌లైన్లో కొనేసుకోవడం మంచిది.
ఒక వైపు మొత్తం చిన్న చిన్నగా కనిపిస్తున్న చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకొ వైపు అసలు మొత్తం ఎడారిలాగా ఉన్న ప్రదేశం. అక్కడ బయటికి ఓపెన్ స్పేస్ ఉండి, చుట్టు గ్లాస్ గోడలు పెట్టారు, బయటికి చూడడానికి వీలుగా. అక్కడ అంత ఎత్తులో బయటికి వెళ్ళగానే చాలా గాలి, చల్లగా అనిపించింది.
నిన్న కింద నుండి చూసిన వాటర్ ఫౌంటెన్ పై ఉంది మొత్తం వ్యూ ఉంది. అప్పుడు అర్థం ఐంది,  నిన్న అసలు సగం ఫౌంటెన్ కూడా కనిపించలేదు, అసలు చాలా పెద్దగా ఉంది అని.
6 కి ఫౌంటెన్ మొదలవగానే అందరు బయటికి వచ్చెసారు. పైనుండి చూస్తుంటే ఇంకా బావుంది.
అలా సూర్యుడు ఆ ఎడారి పైనుండి భూమిలోకి వెళ్ళేవరకి చూస్తూ ఉన్నాం. సూర్యుని కంటే ఎత్తులో ఉండి ;). (అలానే అనిపించింది మరి).
అప్పుడే sun-set అయ్యిందేమో కిందికి వెళ్ళడానికి కూడా ఎలివేటర్ దగ్గర చాలా క్యూ ఉండె. అలా కిందికి వచ్చేసి టాక్సి తీసుకొని హోటల్ అడ్రస్ చెప్పి, అడిగాం దానికి దగ్గర్లో ఏమన్నా మంచి రెస్టారెంట్స్  ఉంటే తీసుకెళ్ళమని. అతను హోటల్‌కి దగ్గర్లోనే తినడానికి ఒక మంచి ప్లేస్ చూపించి మమ్మల్ని దింపి, మేముండే హొటల్ వరకి ఎలా నడుచుకుంటూ వెళ్లొచ్చో చూపించాడు. 
మంచిగా తినేసి ఆ చల్లని గాలిలో (definiteగా న్యూ  యార్క్ లో ఉండే లాంటి చల్లటి చచ్చే గాలి కాదు. మంచి చల్లని పిల్ల గాలి :))
మెల్లగా నడుచుకుంటూ రూంకి వచ్చేసాం... రేపు వెళ్ళబోయే exciting deset safaari గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయా..
Al-arab
Atlantis


             
Water fountain view from top of Burj Khalifa

4 comments: