Wednesday, August 7, 2013

జీవితం చిన్నదా పెద్దదా?

జీవితం చిన్నదా పెద్దదా?

ఒక్కోసారి అనిపిస్తుంది ఈ జీవితం చాలా పెద్దది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరం ఎంత ఎక్కువ సమయమో కదా,ఎంత మందిని కలిసాం, ఎన్ని పనులు చేసామో కదా..  అని..
        ఇంకోసారి అనిపిస్తుంది  ఈ జీవితం ఎంత చిన్నది గడిచిన సంవత్సరం,కాలం ఎంత త్వరగా అయిపోయింది,మొన్ననే కదా అక్షరాలు నేర్చుకుంటూ తొలి అడుగులు వేస్తూ స్కూల్‌కి వెళ్ళింది, నిన్ననే కదా ఏదో సాధించేద్దాం అని కలలు కంటూ కాలేజ్ లో అడుగుపెట్టింది,  అదేంటి అప్పుడే ఇంత పెద్దగా అయిపోయాను అని..

ఒక్కోసారి అనిపిస్తుంది ఏదో సాధించాలి, అనుకున్నవన్నీ జరగాలి, కావాలనుకున్నవన్నీ దొరకాలి అని. ఇది లేకపొతే బ్రతకలేము, అది లేకపొతే సంతోషంగా ఉండలేము అని..ఉన్నది ఒక్కటే జీవితం, చాలా పెద్ద జీవితం అందులో అన్ని సమకూర్చుకోవాలి అని...
           ఇంకోసారి అనిపిస్తుంది ఉన్నవాటితోనె సంతోషంగా ఉండాలి, లేని వాటిని కావాలి అనుకోకూడదు. ఉన్నది చాలా చిన్న జీవితం, లేని వాటి కోసం తాపత్రయపడి ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు.  ఏది ఉన్నా లేకపోయినా ఈ నిమిషం మన చేతిలో ఉంది కదా అని..
Google Photo

ఏది ఎమైనా మనం ఆనందంగా ఉన్న సమయం చాల త్వరగా గడుస్తుంది, బాధల్లో ఉన్నప్పుడు ఎప్పుడు గడుస్తుందా అనిపిస్తుంది...
ఈ జీవితం చిన్నదైనా పెద్దదైనా, సంతోషంగా ఉన్నా విషాదంగా ఉన్నా,నీటి పైన రాత అంత క్షణికమైనా, రాతి మీద చెక్కిన శాసనమంత దీర్ఘమైనదైనా ఏదైనా ఈ జీవితం మనది....

8 comments:

  1. జీవితం 'చిన్నది' కాదు కానీ,
    బ్రతకాలనుకునే వాడికది ప్రేయసి!
    జీవితం పెద్దది కాదు, కానీ
    ప్రేమించే వారికి ,అస్తమించని పొద్దది!

    ReplyDelete
    Replies
    1. @Sudhakar గారు: బావుందండి..

      Delete
  2. అదే మనసు చిత్రం

    ReplyDelete
    Replies
    1. @Sarma గారు: అదే కదా చిత్రమైన మనసు చేసే చిత్రం..

      Delete
  3. s dear i agree vth u... dats lyf....
    either its oneway or other v hav our own way..

    ReplyDelete
  4. s dear i agree vth u... dats lyf....
    either its oneway or other v hav our own way..

    ReplyDelete
  5. jeevitam chaala chinnadi ,andulo miru inta chinna vayasulo jeevitam chudakundaane chaala baaga ardam chesukunnaarandi

    ReplyDelete