Tuesday, August 20, 2013

కిటికీ అవతల ప్రపంచం

కిటికీ పక్కన కూర్చుని బయటికి చూస్తూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు అంటాడు ఒక పుస్తకం లో రచయిత. అది అందరికీ వర్తించదనుకోండి. అందులో ఒక పాత్ర కిటికీ  పక్కన కూర్చుని వచ్చీ పోయే   వాళ్ళని చూస్తూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళు ఏ పరిస్తితుల్లో అక్కడి నుండి వెళ్తున్నారో, ఎం ఆలోచిస్తూ ఉంటారో విశ్లేషిస్తూ ఉంటాడు. ఏమీ తోచనప్పుడు నిజంగా అది మంచి టైంపాస్‌లే .
ఎప్పుడో చదివిన కొన్ని వ్యాక్యాలు నా మాటల్లో..
ఒక హాస్పిటల్లో బెడ్‌కే పరిమితమైపోయిన ఒక గుడ్డివాడు ఉంటాడు. అతని బెడ్ పక్కనే గుండె జబ్బుతో   బాధ పడుతూ హాస్పిటల్లో చేరిన వ్యక్తి ఉంటాడు. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. కళ్ళు లేని వ్యక్తి బెడ్ పక్కన కిటికీ ఉంటుంది, తను రోజు పక్క అతన్ని కిటికీ బయట ఏం జరుగుతుందో చెప్పమంటాడు. ఆ వ్యక్తి తనకి కిటికీ నుండి కనిపించేవి అందంగా తనదైన మాటల్లో గుడ్డివానికి చెప్తూ ఉంటాడు.
ఇప్పుడు కిటికీ అవతల ఉన్న రోడ్ మీద ఒక చిన్న పాప  తన తల్లితో కలిసి వెళ్తోంది. బహుశా స్కూల్ నుండి పాపని ఇంటికి తీసుకెళ్తుందేమో. ప్రొద్దున్నుండి విడిచి ఉన్న కూతుర్ని చూసిన  ఆనందంలో తల్లి మొహం వెలిగిపోతుంది. రోజంతా తను చేసిన పనులు, స్కూల్లో జరిగిన విషయాలు అమాయకమైన నవ్వుతో తల్లికి చెప్తుంది ఆ చిట్టి కూతురు. అమాయకత్వం, కల్మషం లేని బంధం ఇదేనేమో...
ఇంకో రోజు చెప్తాడు
ఒక జంట నడుచుకుంటూ వెళ్తున్నారు, చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా ఉంది. పెళ్ళి నాటి సిగ్గు ఇంకా అమ్మాయి మొహంలో తొలగిపోలేదు. తన భర్త చెయ్యి విడవకుండా పట్టుకొని ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంది, ఈ చెయ్యి ఎప్పటికీ  విడిపెట్టను అన్నట్టు భర్త కూడా అంతే గట్టిగా పట్టుకొని   భరోసా ఇస్తున్నాడు. ప్రేమంటే ఇలా ఉంటుందేమో...
దగ్గర్లో ఉన్న కాలేజ్ నుండి కొందరు అమ్మాయిలు వెళ్తున్నారు. ఇప్పుడే కొత్తగా కాలేజ్‌లో చేరినట్టున్నారు. కొత్త కొత్త ఆశలు, రాబోయే కాలం లో సాధించాలనుకున్న ఆశయాలు కదులుతున్నాయి వాళ్ళ కళ్ళల్లో.
ఇంకో రోజు అప్పుడే పడిన వర్షంలో విచ్చుకొని తడిసిన చిరుమొగ్గ అందాన్ని వర్ణిస్తాడు.
ఇలా ప్రపంచంలోని అందాల్ని, బంధాలని తన మాటల్లో కళ్ళు లేని స్నేహితుడికి చూపిస్తాడు.
మంచంపై  నుండి కదలలేని కళ్ళు లేని వాడికి జీవితం పై కొత్త ఆశ కలిపిస్తాడు.  కొన్ని రోజులకి గుండె జబ్బు వ్యక్తి పరిస్తితి విషమించి చనిపోతాడు. తర్వాత ఆ బెడ్ పైకి ఇంకో వ్యక్తి వస్తాడు. సాయంత్రం కాగానే అతన్ని అడుగుతాడు ఈ గుడ్డివాడు  బయట స్కూల్ పిల్లలు వెళ్తున్నారా అని, అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు అసలు కిటికీ అవతల బయటి ప్రపంచమే కనిపించట్లేదు, అక్కడ గోడ తప్ప ఇంకేమి లేదు అని.
ఇన్నాళ్ళు ఏమీ కనిపించని దాన్ని, అందంగా వివరించి తనలో కొత్త ఉత్సాహన్ని నింపిన తన మరనించిన స్నేహితుడికి మనసులో కృతజ్ఞత చెప్పుకొని, మిగిలిన జీవితాన్ని అదే ఉత్సహంతో కొనసాగించడం తప్ప ఎమి చేయగలడు.
పనిలో పనిగా మా బిల్డింగ్ నుండి కనిపించే వ్యూ చూడండి.
My photo

బావుంది కదా... అక్కడ కూర్చుని కనిపించే రోడ్, వచ్చి పోయే కార్స్ ని చూడ్డం నాకైతే భలే ఇష్టం. అన్నిటికన్నా అలా బొమ్మల్లా వరుసగా పార్క్ చేసిన కార్స్ భలే అనిపిస్తుంది ఎన్ని రోజుల నుండి చూస్తున్నా.. 


11 comments:

  1. తను చనిపోతానని తెలిసి , తన పక్కనున్న వాడిని ( కళ్ళు లేకున్నా ) బ్రతికించాలన్న సద్భావన అత్యంత ప్రశంసనీయం .

    అలా అందంగా కార్లు వరుసగా అమెరికాలో చాలా చోట్ల చూడటం తటస్థించింది .ఫైన్ . అలా పెట్టకుంటే అక్కడ ఫైన్ వేస్తారు సుమా !

    ReplyDelete
    Replies
    1. Sharma గారు: థాంక్యూ..
      నిజమే అండి, అన్ని చోట్లా అలానే పెడతారు, నాకు ఎప్పుడు చూసినా మంచిగా అనిపిస్తుంది..

      Delete
  2. Baaundhamma anaamika

    ReplyDelete
  3. బాగుందండీ.. అపుడపుడూ ఇలా గమనిస్తూ ఊహించడం నాకు కూడా ఇష్టమైన పని.

    ReplyDelete
    Replies
    1. వేణూశ్రీకాంత్ గారు:హ్మ్... కదా, ఇంకా బయట ఎంత ఎక్కువ మనుషులు తిరిగితే అంత టైంపాస్ అవుతుంది.

      Delete
  4. డన్!
    అన్నీ చదివేసా,
    ఫైనల్ గా ఇప్పటి వరకు వాటిలో ఈ పోస్ట్ చాలా బాగా నచ్చింది.
    వర్షం పడుతున్నప్పుడు కిటికీ దగ్గర కూర్చోవడం నాకు ఇష్టం :)

    ReplyDelete
    Replies
    1. ఫోటాన్ గారు:Thanks for reading all my posts and thanks for your comments :)

      Delete