Wednesday, July 31, 2013

ఏమీ తోచక....

ఇప్పుడు నేను మీకు ఒక కవిత చెప్తా అన్నమాట. తీరా చదివేసాక ఇది కవితా..తవికేం కాదు అనొద్దు. 
దమ్ము-దుమ్ము, బుడ్డి-వడ్డీ ఇలాంటి సినిమా పాటలు రాస్తే  వినట్లేదా,ఇది మాత్రం ఎలా తప్పించుకుంటారు ..

Google Image

నా పేరు అనామిక
ఉన్నాను ఏమీ తోచక
చేస్తున్న పని చాలక
అనుకున్నాను ఏమైనా రాయలిక
అందుకే చేసుకున్నాను బ్లాగును దానికి వేదిక
ఇక వీయాలి ఆలోచనల వీచిక
కురవాలి పదాల అల్లిక
కావాలి మీ ఆశీస్సుల కానుక
అదే నా కోరిక

వాహ్వా...వాహ్వా..(ఈ డైలాగ్ నాది కాదు మీదని నాకు తెల్సు :):) )

5 comments:

  1. బాగుంది మీ తవిక....సారి సారి మీ కవిత. ఏదో ప్రాస కోసం అలా అన్నానండి :)

    ReplyDelete
  2. ఏంటమ్మాయ్! మూడు టపాలకే అప్పుడే ఏం తోచటం లేదా? బావుంది. :)

    ReplyDelete
    Replies
    1. ఏదో ప్రాస కోసం రాసా అంతే..

      Delete