Sunday, July 21, 2013

కలల లోకం లో నేను

మీకు కలలు వస్తాయా????
ఇదేం ప్రశ్న !!! కలలు రాకుండా ఎవరైనా ఉంటారా అని అనుకుంటున్నారా??
నాకు అయితే విచిత్రమైన కలలు వస్తాయ్ ...
నేను ఆ రోజు ఎం చేస్తానో, లేకపోతే ఏదైనా సినిమా చూస్తానో రాత్రంతా అదే విషయమ్మీద కలలు.ఒకోసారి కలలో జరిగింది నిజమే అనుకుంటున ఉంటాను
నిన్నే టీవీ లో నరసింహ సినిమా చూసానా , రాత్రి అంత నేను నీలాంబరి ఫ్రెండ్ ఐపోయినట్టు, ఎందుకు అలా మొండిగా చేస్తావ్, నరసింహ ని మర్చి పోయి వేరే పెళ్లి చేసుకోవచ్చుగా అని నేను సర్దిచేప్తున్నా , నీలాంబరి నా మీద కూడా అరుస్తుందట, ఇది నా కల. హ్యాపి డేస్ చుసిన రోజు మా కాలేజ్ లో అందరు ఫ్రెండ్స్ అయపోయినట్టు నక మొత్తం సినిమా వచ్చింది కలలో, కాకపోతే సీన్ మా కాలేజ్ లో .....
ఇంకా చంద్రముఖి రోజు అయితే ఏకంగా జ్యోతిక ప్లేస్ లో నేనే..ఇంకా నయం అరుంధతి చూసినపుడు నాకు అసలు కలేం రాలేదు న అదృష్టం :)
ఒకసారి మా కాలేజ్ లో కొత్త లెక్చరర్ వచ్చింది...రాగానే ఏదో అసైన్మెంట్ ఇచ్చింది ,,,ఇంకా ఆ రోజు కలలో ఆమే పళ్ళు అమ్ముతుందట కాలేజ్ లో సాయంత్రం వరకు ఎవరు ఎక్కువ పళ్ళు అమ్మి పెడితే వాళ్ళు అసైన్మెంట్ ఫినిష్ చేసినట్టు ,ఎక్కువ పళ్ళు అమ్మితే ఎక్కువ మార్క్స్ అట ..ఇంకా చూడాలి తర్వాత నుండి ఎప్పుడు ఆ క్ల్లాస్ లో ఆమెని చుస్తే ,అరటిపళ్ళు , ఆపిల్ లు ముందు పెట్టుకుని పళ్ళు అమ్మే సీన్ గుర్తుకు వచ్చేది.

6 comments:

  1. హ హ బాగున్నాయి అండి మి విచిత్రమైన కలలు. మీలాగే విచిత్రమైన కలలు నాకు కూడా వస్తాయ్ అండి కాకపోతే మీకు ఆ రోజు ఏం చేస్తె దానికి రిలేటడ్ గా వస్తాయ్ నాకు ఆ రూల్ లేదండి . వీలైతె చదవండి నా వీరొచితమైన కలలు

    ReplyDelete
  2. వీలైతె word verification తీసెయండి

    ReplyDelete
  3. mee kalalu bagunnayamDi, haayi ga anni mumde chusestunnaru..

    ReplyDelete
  4. హి హి హి....బాగుంది...నాకు కూడా ఇలాగే కళలు వస్తుంటాయి.. మీకు చూసిన సినిమాలే వచ్చాయి, నాకైతే రాబోయే సినిమాలు కూడా కలలుగా వచ్చేవి.. ఆ విధంగా కొన్ని సినిమాలు ముందుగానే చూసా..నిజం చెప్పాలంటే, అవి రిలీజ్ అయ్యాక చూసి..వాటి కన్నా నా కలలో వచ్చిన సినిమానే బాగుంది అనిపించింది :-)

    ReplyDelete