Tuesday, July 30, 2013

గన్ షూటింగ్

ఎప్పుడు షాపింగూ, రొటీన్ పనులు కాకుండా ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాం అనుకుని, దగ్గర్లో ఏమున్నాయి అని వెతుకుతూంటే గుర్తొచ్చింది, గన్ షూటింగ్ రేంజ్ ఉంది దగ్గర్లోనే, పైగా ఎప్పుడూ వెళ్ళలేదు కూడా.
షూటింగ్ రేంజ్ అంటే అక్కడ కొంత స్పేస్ తో కొన్ని లైన్స్ ఉంటాయ్. ఒక్కో లైన్లో
కావాల్సిన దూరం లో ఒక టార్గెట్ ని సెట్ చేసుకొని, గన్ తో షూట్ చెయ్యాలి. గన్ అంటే బొమ్మ గన్ కాదు, నిజ్జంగా నిజం  తుపాకినే.   అందులోకి వెళ్ళే ప్రతి మనిషికి కొంత ఛార్జ్ చేస్తారు, ఇంకా గన్ కి, బుల్లెట్స్ కి మనకి కావాలనుకున్న దాన్ని బట్టి రెంట్ తీసుకోవాలి.
సరే వెళ్దాం అని డిసైడ్ అయ్యాక, appointment తీస్కుందాం అని కాల్ చేస్తే, కేవలం members మాత్రమే reservation చేసుకోవచ్చంట. మాకు మెంబర్‌షిప్ లేదు కాబట్టి వెళ్ళి లైన్లో వెయిట్ చేస్తే అప్పుడు బుక్ చేసుకోవచ్చు అని చెప్పాడు, కావాలంటే మన సొంత గన్స్ కూడా తీస్కెళ్ళొచ్చు అంట.
అక్కడికెళ్ళాక  ఒక ఫాం నింపమని ఒక అరగంట వెయిట్ చేయించాక మా ID కార్డ్స్ తీసుకున్నాడు. చాలా గన్స్, రైఫిల్స్ చాలా రకాలవి డిస్‌ప్లే  లో పెట్టి ఉన్నాయ్. వెళ్ళనైతే వెళ్ళం కాని వాటిని చూడగానే కొంచెం భయమేసింది. చాలా మంది వాళ్ల సొంత గన్స్ అనుకుంటా బయటి నుండి తెచ్చుకుంటున్నారు, అయిపోగానే వాళ్ళతో తీస్కెళ్తున్నారు.
  ఒకసారెప్పుడో  TV లో చూసా, గన్ పేల్చితే ఆ ఫోర్స్ కి పేల్చిన వ్యక్తి వెనక్కి పడిపోయాడు. మనకి మరీ ఆ రేంజ్ లో వద్దని, వాడికి చెప్పాం, ఇదే ఫస్ట్ టైం షూటింగ్ రావడం సో కొంచెం ఈజీ   గా ఉండేది ఇవ్వమని.
మొత్తం నలుగురం వెళ్ళాం కాబట్టి 2 గన్స్ చాలనుకున్నాం. వాడు ఒక పిస్టల్ ఇంకా ఒక రైఫిల్ తీసి, వాటిని ఎలా పట్టుకోవాలో, ఏ position లో నిల్చోవాలి, ఎలా ఫైర్ చెయ్యాలి అంతా చూపించాడు.
తర్వాత బుల్లెట్స్ తీసుకొచ్చి, లోడ్ చెయ్యడమూ, రీఫిల్ చెయ్యడం చూపించాడు. అలా 2 గన్స్ రెంట్ తీస్కొని, కళ్ళకి, చెవులకి సేఫ్టీ కోసం  గ్లాసెస్, ear muffs పెట్టుకొని లోపలికి వెళ్ళాం. 
Google Image
ఏ రోడ్ మీదనో ఇంకెక్కడో ఒక సైకో వచ్చి మనల్ని గన్ తో షూట్ చేస్తే అయ్యో పాపం అనుకుంటారు కాని, ఇప్పుడు ఎవరన్నా మనల్ని కాల్చేస్తే కనీసం పాపం అని కూడా అనుకోరు అనుకున్నాం.  
లోపల కూడా ఒక ఆఫీసర్ ఉన్నాడు, డౌట్స్ వస్తే చెప్పడానికి ఇంకా ఎలా షూట్ చేస్తున్నారో చూడడానికి. 
ఇంకా ఆ గన్స్ లో ఒక్కో బుల్లెట్ మెల్లగా లోడ్ చేస్తూ, మధ్య మధ్యలో అతన్ని మళ్ళీ అడిగి  మొత్తానికి ఒక గన్ లోడ్ చేసాం, మళ్ళీ సరిగ్గా లోడ్ చెయ్యక తేడా వచ్చి అది వెనక్కి పేలిపోతే ఎలా అని( అతడు సినిమా లో లాగ). అందరు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే మేము మాత్రం అన్నిటికన్నా పెద్దగా ఉన్న టార్గెట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం దగ్గర్లో సెట్ చేస్కున్నాం.
ఇంక ఫస్ట్ బుల్లెట్ పెల్చే అప్పుడు మాత్రం నిజంగానే కొంచెం చేతులు వణికాయి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నలుగురం కలిపి గంటలో ఒక 20 కూడా కాల్చామో లేదో ( వాడు 200 బుల్లెట్స్ ఇచ్చాడు, గంటసేపు  ఉంటాం అంటే). ఇంకా చాలని చెప్పి వచ్చేసాం. 
అదీ సంగతి.. 

5 comments:

  1. అమ్మో నిజం గన్నే !! శీర్షిక చూసి తిరనాళ్ళలో బెలూన్స్ కాల్చే గన్ అనుకున్నానండీ.

    ReplyDelete
    Replies
    1. హహ నిజం గన్నే అండి. అక్కడ మేము తప్ప మిగతా వాళ్ళందరూ టకాటకా కాల్చేస్తున్నారు.

      Delete
  2. ఈవాళ చాలా పోస్ట్స్ చదివాను, బాగా రాస్తున్నారు, బాగున్నాయి మీ అడ్వెంచర్స్ (గన్ షూటింగ్, బస్సు జర్నీ.... ) :)

    ReplyDelete
    Replies
    1. ఫోటాన్ గారు: థ్యాంక్సండి.

      Delete