Thursday, July 25, 2013

ఒక నిజం..

ఎన్నో కథలు చదువుతుంటాం. వాటిలో ఎన్నో మర్చిపోతాం, కొన్ని గుర్తుంటాయ్, కాని అందులో కొన్ని లైన్స్ అలానే నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి
నన్ను నేను ద్వేషిస్తున్నా.
నిన్ను ప్రేమించినందుకు కాదు
నిన్ను వదిలేసినందుకు కాదు
నీకు దూరంగా ఉన్నందుకు కాదు
నిన్ను మర్చిపోయి బ్రతకగలుగుతున్నాను అన్న నిజం తెలిసినందుకు..

ఏదో కథలో చదివా ఇది కొన్ని నెలల ముందు, ఆ కథ అందులో స్టోరీ ఏంటో గుర్తులేదు కాని ఈ నాలుగు లైన్స్ గుర్తుండిపోయాయి.  



4 comments:

  1. ఇపుడు కవితలపంక్తులే ఏమాత్రం గుర్తుండి చావడం లేదు!అటువంటపుడు అనామిక గారు ఎపుడో చదివిన కథలోని ఐదు పంక్తులు తమ స్మృతిపేటికలో పదిలపరచుకొని గుర్తుంచుకోగలగడం ఎంతో గొప్ప!

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్స్ Surya Prakash గారు, కొన్ని కొన్ని అలా గుర్తుంటాయ్ (అవసరం లేని విషయాలు :) )

      Delete
  2. ఆ కవితో, కాకరకాయో , నిజమో ఏదో ఒకటి నాకు సంభంధం లేనిది కానీయండి, మీ రిప్లై లో "కొన్ని కొన్ని అలా గుర్తుంటాయ్ (అవసరం లేని విషయాలు :) )" ఇది చూడగానే విపరీతం గా నవ్వోచ్చేసింది :-) ఎందుకంటే నేనూ అదే జాతి :-)))

    ReplyDelete
    Replies
    1. Sravya గారు: హహ.. అదేంటో చదివింది గుర్తుంచుకోవాలంటే ఎంత కష్టపడాలి.చిన్నప్పుడు చదివిన పాఠాలేం గుర్తుండవు కాని, ఎప్పుడో విన్న పాటలు మాత్రం అర్థం తెలియక పోయినా గుర్తుంటాయ్.

      Delete