Friday, March 21, 2014

ఎంతెంత దూరం!!

ఎంతెంత దూరం వెల్లొచ్చా..
ఎంత దూరం వెల్లొచ్చావు...
చాలా రోజుల తర్వాత office వచ్చా..
ఎక్కడికెళ్ళావమ్మా ఇన్ని డేస్...
హాయిగా india ఎల్లొచ్చాగా..
google Image
(Emirates లో వెల్లా అందుకే emirates image)
అవునా..ఎన్ని రోజులు వెళ్లావేంటి..
40 రోజులు..40 రోజులే...
అంతకన్నా ఎక్కువిస్తారేంటి లీవ్ నీకు, అప్పటికి మీ మేనేజర్ కి ఏదో స్టోరీ చెప్పబట్టి కాని లేకపోతే 3 weeks కంటే ఎక్కువ లీవ్ ఇచ్చాడా ఎవరి కన్నా..
అంతేలే...ఏం చేస్తాం..
సరే ఏం చేసావ్ ఇండియాలో...
ఏం చేసా అంటే చాలా చేసినట్టు, full తిరిగినట్టు అనిపిస్తుంది కాని చెప్పడానికి పెద్దగా ఏమి చెయ్యలేదు. చుట్టాలు, ఫ్రెండ్స్ అందర్నీ కలిసా ఈసారి. last time కన్నా కొంచెం ఎక్కువ టైం ఉన్న కదా. నా close ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి 2 డేస్ ఉన్నాను. ఇంకా happy thing ఈసారి మా చెల్లి నేను ఉన్నన్ని డేస్ నాతోనే ఉంది ఎక్కడికెళ్ళినా.నేను వస్తున్నా అని 15 రోజులు లీవ్ పెడతాను అంది కాని అసలు వెళ్ళనే లేదు. తర్వతా ఏదో లాగా మేనేజ్ చేసుకుంటుందిలే అని నేను కూడా ఉండిపొమ్మన్నా..
కావాల్సినవన్నీ ఇంట్లో చేయించుకొని తిన్నా..shopping చేసా..తిరుపతి వెల్లొచ్చాం..ఇంకా అమ్మమ్మ వాళ్ళూరికి వెళ్ళొచ్చా
అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చావ్ సరే..వస్తూ మాకేం తెచ్చావ్ మరి..
స్వీట్సూ, పచ్చళ్ళూ ఇంకీ జంక్ ఫుడ్ తెచ్చా,,కావల్సినన్ని తిను..
వచ్చాక ఏం చేసావ్ మరి..
hmm.. అదెందుకు అడుగుతావ్‌లే..
India లో హాయిగా jackets, coats లేకుండా తిరిగానా, ఇక్కడ flight దిగగానే చ్.చలి. దిగగానే అందరు ఒక్కటే మాట, ఎంత bad winter తప్పించుకున్నావ్  అని.  ఇంటికొచ్చి నా కార్ start చేస్తే అది గుర్..గుర్.. అంటుంది తప్ప start అవ్వట్లేదు.ఈ చలికి engine ఎప్పుడో చచ్చి ఉంటది.
తెల్సిన వాళ్ళ దగ్గర jump cable అడుక్కొచ్చి స్టార్ట్ చేద్దాం  అని try చేస్తే మా ఫేస్‌లకి అది ఎలా చెయ్యాలో తెలీలేదు. మళ్ళీ మా roommate వాళ్ల ఫ్రెండ్ కి కాల్ చేస్తే అతనొచ్చి start చేసి వెళ్ళాడు. ఇంకేముంది ఇంక రోజూ రొటీన్ office మళ్ళీ.. :(:(

7 comments:

  1. కార్ కూడా తీసుకొని వచ్చింటే బాగుండేది కదా. పాపం దానిని ఒంటరిని చేసి వెళ్ళే మనసెలా వచ్చింది అసలు మీకు ?

    Hope you had nice trip :)

    ReplyDelete
    Replies
    1. హహ.. ఒంటరిని ఏం చెయ్యలేదు.. మా రూమ్మేట్స్ కార్స్ ఉన్నాయి దానికి తోడుగా..
      yeah..had a veryyyy nice trip.Thanks for your comment

      Delete
  2. Welcome back and narration chaala baagundhi. So meeru inka india vellochina depression lone unnaru anna maata. Depression ani enduku annanu ante, US vachhaka definite ga oka 2 months home sick untundhi and ela anipisthundhi ante urgent ga job choosukuni India back ki veldham anipisthundhi. People will be on an emotional roller coaster which is quite natural after coming back from India :).

    ReplyDelete
    Replies
    1. హ్మ్... వచ్చే అప్పుడు ఇంకా ముఖ్యంగా ఇండియా నుండి వచ్చే 2,3 రోజుల ముందు నుండి బాగా అనిపిస్తుంది, వెళ్ళొద్దు మళ్ళీ అక్కడికి అని..వచ్చాక మళ్ళీ ఉరుకులు పరుగులు అంతా మామూలే...

      Delete