Tuesday, January 7, 2014

సోప్ చాక్లెట్..

మీలో చాక్లెట్స్ అంటే ఎంతమందికి చాలా ఇష్టమో చేతులెత్తండి...పోని కొంచెం ఇష్టమున్న వాళ్ళు కూడా ఎత్తండి.. నాకు తెల్సు దాదాపుగా అందరు ఎత్తేసారు కదా.. ఇప్పుడు ఎత్తిన చేతులు దించి కింది పోస్ట్ చదవండి.
మొన్న  క్రిస్మస్ హాలిడేస్‌కి అందరం ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో కలిసాం. నేను వెళ్ళేఅప్పుడు ఒక చాక్లెట్ box తీసుకెళ్ళా. వెళ్ళగానే అది నేను ఎలా ఉన్నాను అనైనా అడగకుండా ఏమందో తెల్సా..ఇంకోసారి ఇంటికి రావాలనుకుంటే చాక్లెట్స్ కాని స్వీట్స్ కాని తీసుకెళ్ళకూడదట. ఒకవేళ కాదని తీసుకొస్తే  ఇంట్లోకి రానివ్వదట.
ఏం.. పాపం వాళ్ళింట్లో చిన్నపిల్లలెవరో ఉండుంటారు.. వాళ్ళు అన్ని తినేస్తేhealth పాడైపొతుందని భయపడుతుంది అనుకుంటున్నారా....మీరూహించింది కరెక్టే, కాని హాఫ్ మాత్రమే కరెక్ట్. భయమే కాని పిల్లలు లేరు వాళ్ళింట్లో.. భయం వాళ్ళాయన గురించి.
అవును మరి మేం వెళ్ళాక అతికష్టం మీద 10 నిమిషాలు ఆగి ఇంక ఆగలేక ఆ చాక్లెట్ box open చేసాడు. మా ఇంట్లో అయితే ఒక వారం పాటు తిన్నా ఆ box అయిపోదు. తను అచ్చు బఠాణీలో, పల్లీలో తిన్నట్టు టకా టకా నోట్లో వేసుకొని తినెసాడు. మా ఫ్రెండ్ పాపం అరుస్తూనే ఉంది  చాలు చాలు అని. అసలే doctor తనని స్వీట్స్ ఎక్కువ తినొద్దన్నాడట.

Google Image       


ఇంక లాభం లేదని వెళ్ళి లాక్కుని లాస్ట్ ది అని ఒక హాఫ్ bar ఇచ్చింది. సరే అని ఆ సగం బుధ్ధిగా తిని, ఇంట్లో అటు ఇటు ఒక round తిరిగొచ్చ్, అరె ఇక్కడెవరో చాక్లెట్ సగం తిని పెట్టారు.. అలా ఉంచొద్దు అని ఠక్కున మిగతాది కూడా తినేసాడు.

అలాంటి మనిషి ఒకసారి office నుండి train ఎక్కడానికి హడావిడిగా నడుచుకుంటూ వెళ్తుంటే, రోడ్ పైన చాక్లెట్ sample చేతిలో పెట్టారట.చాక్లెట్ చూస్తే ఆగుతాడా ఇంక తను, వెంటనే open చేసి నోట్లో వేసుకొని as usualగా బఠాణి నమిలినట్టు నమిలేసాడు. కాసేపయ్యాక ఇందేంటి నోట్లొంచి నురగొస్తుంది అని doubt వచ్చి, ఇదేదొ తేడా ఉంది అని ఆలోచించి అప్పుదు realize అయ్యాడు, అది చాక్లెట్ కాదు సబ్బు అని.. ;)
భలే దొరికిపోయాడు అందరికి అక్కడున్న ఉన్న 2 days ఏడిపించడానికి.
దీనికి highlight ఏంటంటే మరి నీకు doubt రాలేదా, చాక్లెట్ తియ్యగా లేదని అంటే..అనుకున్నాడట అప్పటికీ ఇదేంటి ఈ చాక్లెట్ తియ్యగా లేదు, sugar ఉన్నవాళ్ళ కోసం specialగా చేసారేమో తియ్యగా లేకుండా అని తినేసాడట.
ఇంకేం చేస్తాడు వెంటనే పక్కనున్న shopలోకెళ్ళి water bottle కొనుక్కొని నోరు కడుక్కొని ఇంటికొచ్చెసాడు...
అదీ సోప్ చాక్లెట్ సంగతి..
by the way  చెప్పడం మర్చిపోయా HAPPY NEW YEAR..

13 comments:

  1. :)) మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  2. హహహ బాగుందండీ సోప్ చాక్లెట్ ప్రహసనం :) నిజమే కొన్ని సోప్స్ మరీ చాక్లెట్స్ లా అందమైన రాపర్స్ లో చుట్టి అమ్ముతారు.
    మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనామిక గారు :) లాంగ్ గ్యాప్ తీస్కుని వచ్చినట్లున్నారుకదా... ఈ కొత్త సంవత్సరం ఆపకుండా తరచూ రాస్తుండండి :)

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా వేణూ గారు, నేనూ రాద్దాం అనుకుంటూనే ఉంటాను..కాని తెలియకుండానే టైం అయిపోతూ ఉంటుంది.

      Delete
  3. హ హ హ హ హ :)

    చాలా రోజుల తర్వాతా కనిపిస్తున్నారు, బాగున్నారా పేరు లేని అమ్మాయి గారూ ?
    --
    అనామకుడు

    ReplyDelete
  4. పాపం, ఆ నురగను చూసి ఎంత టెన్షన్ పడి ఉంటారో అతను :-)
    బాగుందండీ :-)

    ReplyDelete
    Replies
    1. Thank you...ఇంతకు ముందుమీ profile నుండి చూస్తే మీ blog ఉండేది, ఇప్పుడు కనిపించట్లేదేంటండీ!

      Delete
  5. హహ్హహ్హ! పాపం ఆయన :P
    మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనామిక గారు (చాలా ఆలశ్యంగా) :)

    ReplyDelete