Friday, February 3, 2017

కోర్ట్‌కెందుకెళ్లాల్సి వచ్చిందంటే.. 1

నాకు ఫైన్ ఎలా పడిందో మొన్న చెప్పా కదా..ఎప్పుడైనా కాప్ ఫైన్ ఇచ్చాక దాని పైన ఫైన్ కట్టాలనుకుంటే ఎలా కట్టొచ్చు, ఒకవేళ అది పే చెయ్యడానికి మనం ఒప్పుకోకపోతే ఆ విషయం తెలియజెయ్యడానికి వివరాలు ఉంటాయి.  ఫైన్ కట్టము అనుకుంటే కోర్ట్ కి రమ్మని ఒక డేట్ ఇస్తారు, ఆరోజు వెలితే వాళ్ల నిర్ణయం చెప్తారు, మొత్తం ఫైన్ కట్టాలా లేక ఏమన్నా తగ్గిస్తారా అన్నది.
సరే నేను కోర్ట్‌కి రావాలనుకుంటున్నాను అని టిక్ చేసాను ఆ వెబ్‌సైట్ లో.
ఒక 2 వారాలకి, ఫలానా రోజు కోర్ట్‌కి రమ్మని మెయిల్ వచ్చింది.
ఆరోజు కోర్ట్ కి వెళ్లాల్సింది మధ్యాహ్నం టైం కాబట్టి, ప్రొద్దున ఇంట్లోంచి పని చేసి, మధ్యాహ్నం లీవ్ పెట్టా, అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా.ఒక్కదాన్నే వెళ్తున్నా కదా అని ఇచ్చిన టైం కన్నా కొంచెం ముందు వెళ్లా, అక్కడ ఎలా ఉంటదో, కరెక్ట్‌గా ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొవడానికి టైం పడుతుందేమో అని. లోపలికి వెళ్లగానే రెసెప్షన్ ప్లేస్ లో బోర్డ్ పెట్టి ఉంది. ఆరోజు ఎవరెవరికి టైం ఇచ్చారు, ఏ టైం కి అని. నా పేరు అందులో ఉంది అని చూసుకొని అక్కడ ఉన్న అతన్ని అడిగా ఎటు వైపు వెళ్లాలి, వెళ్లాక ఏం చేయాలి, ఇలా ఈ టైం కి నాకు హియరింగ్ ఉంది అని. అతను ఎటువైపు వెళ్లాలో చూపించి, లోపల కోర్ట్ హాల్లో వెళ్లి కూర్చుంటే టైం ప్రకారం నా పేరు పిలుస్తారు అని చెప్పాడు. కోర్ట్ హాల్లో చిన్న స్టేజ్ లాంటి పైన్ జడ్జ్ కూర్చున్నాడు. అతని పక్కనే ఏవో పేపర్స్ చూపిస్తూ ఒకామె  ఉంది అసిస్టంట్ లాగ.
స్టేజ్ కింద హాల్ కి అటు పక్క ఇటు పక్క ఒక్కో టేబుల్, దాని దగ్గర ఒకరు కూర్చుని ఉన్నారు.
మిగతా హాల్ అంతా ఒకదాని వెనక ఒకటి బెంచ్ లాగా సీట్స్ ఉన్నాయి.
అమ్మో...ఇప్పుడు నా పేరు పిలిచి అక్కడ నిల్చోబెట్టి, ఏం చేసాను, ఎందుకు not guilty అని అప్లై చేసాను అని అందరి ముందు చెప్పమంటారేమో...ఏం చెప్పాలి..ఎలా చెప్పాలి బాబోయ్..అనుకుంటూ వెళ్లి ఒక బెంచ్ లో కూర్చున్నా. ఎక్కువ జనం ఏం లేరు. ఒక 15, 20 మంది ఉన్నారేమో. ఈ లోపు ఆ సైడ్ టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్లు ఒక్కొక్క పేరు పిలుస్తున్నారు.తమ పేరు పిలిచిన వాళ్లు వెళ్లి అక్కడ నిల్చుని వాళ్లతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. so మొత్తానికి అందరికి వినబడేలాగా మాట్లాడే పని లేదన్నమాట. అక్కడే సగం టెన్షన్ పోయింది నాకు. పోన్లే మనం ఏం మాట్లాడినా ఎవరికి తెలియదు :). ఇలా అలోచిస్తుండగానే నా పేరు పిలిచాడు ఒక సైడ్ టేబుల్ అతను.
అతని దగ్గరికి వెళ్లగానే నా కేస్ పేపర్స్ తీసి చదివి, సో నువ్వు ట్రైన్ ఆగినప్పుడు వెనకనుండి ట్రాక్స్ దాటావన్న మాట, అలా చెయ్యడం చాలా డేంజర్ కదా, ఇంకోసారి అలా చెయ్యకు, నీ ఫైన్ క్యాన్సల్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ పేపర్ లో అది రాసుకొని, నువ్వెళ్లొచ్చు అన్నాడు.సరే ఇంకెప్పుడు అలా చెయ్యను అని చెప్పి,  అంతే అయిపోయిందా..అనుకొని బయటికి వచ్చేసా. నిజంగానే మళ్లీ అలా ఎప్పుడూ దాటలేదు కూడా..

4 comments:

  1. That's a good decision - rules are there to protect us.

    ReplyDelete
    Replies
    1. That's true..thanks for your comment Lalitha gaaru!!

      Delete
  2. మొదటి టపాలో దేశం ఏదో తెలుస్తూనే ఉంది, ఇది భారతదేశంలో జరుగుతుందా అని ఆశ్చర్యపోయానంతేనండీ!

    ఇలా కోర్ట్ కొస్తానంటే రమ్మన్నారా? వెళితే ఎక్కడకెళ్ళాలో చెప్పేరా, మీరెళ్ళి చెబితే ఫైన్ కొట్టేసేరా! వామ్మో!వామ్మో మమ్మల్ని మరీ భయపెట్టేస్తున్నారండి.మేము కోర్ట్ కెళ్ళాలంటే ఎంత తతంగాం, ఒక లాయరు వగైరా...ఒక రోజో రెండు రోజులో కోర్ట్ వరండాలో కూచోవద్దూ!ఈ బాధలన్నీ పడక కాప్ చేతిలో వంద రూపాయలెట్టేస్తే రైల్ కూడా ఎక్కేసి వెళ్ళిపోతాం. కేస్ అంటే అక్కడంత సింపులా!

    మా దేశంలో రైల్ గేట్ కిందనుంచి దూరెళ్ళినా అడిగేవాడే ఉండడు, మోటార్ సైకిల్ తో సహా, బండి ఎదురుగా వస్తున్నా. చచ్చేవాళ్ళు అలా చస్తూనే ఉంటారు... అది మామూలే మాకు.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ కొన్ని విషయాలు ఎంత సింపులో, కొన్ని విషయాల్లో అంత కాంప్లికేటెడండీ..Thanks for comment Sarma gaaru!!

      Delete